Long Covid Symptoms: కరోనా వైరస్‌పై కీలకమైన అప్డేట్, లాంగ్ కోవిడ్ లక్షణాల్లో శరవేగంగా మార్పులు
![Long Covid Symptoms: కరోనా వైరస్‌పై కీలకమైన అప్డేట్, లాంగ్ కోవిడ్ లక్షణాల్లో శరవేగంగా మార్పులు Long Covid Symptoms: కరోనా వైరస్‌పై కీలకమైన అప్డేట్, లాంగ్ కోవిడ్ లక్షణాల్లో శరవేగంగా మార్పులు](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2022/12/05/254957-long-covid.jpg?itok=9pIqSjzV)
Long Covid Symptoms: కరోనా దీర్ఘకాలిక లక్షణాలపై కీలకమైన అప్డేట్ వెలువడింది. దీర్ఘకాలిక కోవిడ్ వైరస్ లక్షణాలు వేగంగా మారిపోతుంటాయని లాన్సెట్ పరిశోధకులు వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం..
లాన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ విషయంలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. దీర్ఘకాలం వెంటాడే కరోనా సైడ్‌ఎఫెక్ట్స్ కాలక్రమంలో మారిపోతుంటాయని లాన్సెట్ అధ్యయనం తెలిపింది.
లాన్సెట్ సంస్థ ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో నిర్వహించింది. రీసెర్చ్‌లో 11 నుంచి 17 ఏళ్ల చిన్నారుల పీసీఆర్ పరీక్షించారు. సెప్టెంబర్ 2020 నుంచి మార్చ్ 2021 మధ్యకాలంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత అంటే 6 నెలల తరువాత ఒకసారి తిరిగి 12 నెలల తరువాత మరోసారి పిల్లల్లో కన్పించే లక్షణాలను పరిశీలించారు.
పిల్లల్లో, పెద్దల్లో ఒకేలా లక్షణాలు
5086 మంది పిల్లల శాంపిల్స్ సేకరించారు. ఈ పిల్లల్లో 2909 కరోనా పాజిటివ్ కాగా, 2177 మంది నెగెటివ్ . పరిశోధకులు 21 సాధారణ లక్షణాల జాబితా సిద్ధం చేశారు. ఉదాహరణకు శ్వాసలో ఇబ్బంది అలసట, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తిపై ప్రభావం. రీసెర్చ్ సందర్బంగా చేసిన పరీక్షల్లో పిల్లలు, పెద్దల్లో ఒకేలా లక్షణాలున్నాయి. ఆరు నెలలు, 12 నెలల తరువాత మరోసారి పరీక్షించినప్పుడు పాజిటివ్ ఉన్నవారిలో 11 శాతం మందికి అలసట ఎప్పుడూ ఉండేదన్నారు. నెగెటివ్ ఉన్నవారిలో 1.2 శాతం మందికి మూడు సార్లు అలసట ఉండేదన్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ తరువాత కాలం గడిచేకొద్దీ కోవిడ్ లక్షణాలు కూడా తగ్గుతుండేవన్నారు. పిల్లల విషయంలో 6 నెలల తరువాత లక్షణాలు మారిపోయాయి. అదే విధంగా జీవన ప్రమాణం, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి వంటి కారకాల్ని మరోసారి చెక్ చేసినప్పుడు వాటిలో కూడా మార్పు కన్పించింది.
దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు
దీర్ఘకాలిక కోవిడ్‌లో కోవిడ్ సోకిన తరువాత కూడా లక్షణాలు కన్పిస్తాయి. లేదా నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంటాయి. కరోనా వైరస్ నుంచి రికవర్ అయిన తరువాత ఒకవేళ పిల్లల్లో 4 వారాల తరువాత కూడా ఎనర్జీ లేకపోతే..ఆకలి వేయకపోతే..బరువు పెరగకపోతే..తలనొప్పి, బ్రెయిన్ ఫాగ్ కొనసాగుతుంటే వీటిని దీర్ఘకాలిక కోవిడ్‌గా చెప్పవచ్చు. లాంగ్ కోవిడ్ అనేది తొలుత 6 నెలల వరకూ కన్పించేది. కానీ ఇప్పుడు 12 నెలల వరకూ కన్పిస్తోంది.
Also read: Diabetes: రూట్ వెజిటబుల్స్ రోజూ తీసుకుంటే ఆ వ్యాధి నుంచి ఉపశమనం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook