గత ఏడాది ఫిబ్రవరి నెలలో తొలి కరోనా వైరస్ కేసు భారత్‌లో నమోదైంది. పలు రంగాల వారిని కరోనా మహమ్మారి ఇబ్బందులకు గురి చేసింది. ఆర్థిక సంక్షోభ పరిస్థితులు సైతం తలెత్తడంతో ఒక్కొక్కటిగా యథాతథంగా సేవలు తిరిగి ప్రారంభించారు. గత ఏడాది ఏనాడూ 24 గంటల వ్యవధిలో లక్ష కేసులు నమోదు కాలేదు. కానీ ప్రస్తుతం ఏకంగా 3 లక్షల వరకు కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1.56 కోట్లకు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా వ్యాక్సిన్లు సైతం 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మే 1 నుంచి యువత నుంచి అన్ని వయసుల వారికి టీకాలు ఉచితంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఇవ్వనున్నారు. కరోనా లక్షణాలు(CoronaVirus Symptoms) జ్వరం, కండరాల నొప్పులు, పొడి దగ్గు, వాసన మరియు రుచి గుర్తించలేక పోవడం కరోనా ఫస్ట్ వేవ్‌లో కనిపించాయి. ప్రస్తుతం కరోనా రెండో దశలో తలనొప్పి, డయేరియా, కళ్లు గులాబీరంగులోకి మారడం, వేళ్లు రంగులు మారడం లాంటి కొత్త లక్షణాలు పలువురు కరోనా బాధితులలో గుర్తించారు. అయితే కరోనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఏమేం పాటించాలి, ఏ విషయాల జోలికి వెళ్లకూడదన్న వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.


Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు


మీకు స్వల్పంగా జ్వరం, నొప్పులు, ముక్కు కారడం, జలుబు, గొంతు పొడిబారడం, డయేరియా, వాసన మరియు రుచి గుర్తించలేక పోవడం లాంటి లక్షణాలు ఉంటే..
చేయాల్సినవి: మీకు మీరు సొంతంగా ఐసోలేషన్‌కు వెళ్లండి. కుటుంబ సభ్యులకు కాస్త దూరంగా ఉండాలి. ప్రత్యేక గదిలో ఉండాలి. ఇతరులు వాడని బాత్రూమ్ ఉంటే వినియోగించుకోవాలి. మీ దుస్తులు, వస్తువులను కుటుంబ సభ్యులు ముట్టుకోకుండా దూరంగా ఉంచాలి. మీ జ్వరం, ఇతర లక్షణాలు, ఆక్సిజన్ స్థాయిలను తరచుగా పరీక్షించుకోవాలి.


చేయకూడనివి: స్టెరాయిడ్స్ లాంటి మెడిసిన్ తీసుకోకూడదు. ఇంటి వద్ద మీకు మీరే రెమ్‌డెసివిర్(Remdesivir) వాడకూడదు. మెడిసిన్ తీసుకునే ముందు దగ్గర్లోని వైద్యుడ్ని సంప్రదించాలి.


Also Read: Covisheild Vaccine Price: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా


ఒకవేళ మీకు దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు, వారం రోజులకు పైగా జ్వరం, ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ లాంటి లక్షణాలు ఉంటే...
చేయాల్సినవి: మీకు వచ్చిన జ్వరం, ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడూ పరీక్షించుకోవాలి. నేరుగా గానీ, లేదా ఫోన్ కాల్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకవేళ స్థాయి పడిపోతున్న నేపథ్యంలో మీరు ఏదైనా ఆసుపత్రిలో బెడ్ ఏర్పాటు చేసుకునేందుకు యత్నించాలి. అదే సమయంలో ఆక్సిజన్ సిలిండర్ అందించే వారి కోసం ప్రయత్నించాలి. 


చేయకూడనివి: డాక్టర్లను సంప్రదించడకుండా ఎలాంటి మెడిసన్ తీసుకోకూడదు. లక్షణాలు ముదురుతున్నా, ఆక్సిజన్ స్థాయి 90 కన్నా తక్కువగా ఉంటే ఇంటి వద్ద ఉండకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook