Covid19 Cases in India: మొన్నటి వరకూ దాదాపుగా జాడ లేని కరోనా వైరస్ మరోసారి ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పరీక్షలు పెరిగే కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 1300 కొత్త కేసులు నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి క్రమక్రమంగా పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 89,078 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1300 మందికి పాజిటివ్‌గా తేలింది. అంటే రోజువారీ పాజిటివిటీ రేటు 1.46 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,99, 418కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మరణించారు. గుజరాత్ మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఒక్కొక్కరి చొప్పున మృత్యువాత పడ్డారు. అదే సమయంలో గత 24 గంటల్లో 718 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీ సంఖ్య 4,41,60, 997కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు దేశంలో 98.79 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 7,605 ఉన్నాయి.  దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక 13 రాష్ట్రాల్లో జీరో కేసులున్నాయి.


గత 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 334, గుజరాత్‌లో 247, కేరళలో 172, కర్ణాటకలో 105, ఢిల్లీలో 84 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు దేశంలో కోవిడ్ 19, ఇన్‌ఫ్లుయెంజా పరిస్థితి, ఆరోగ్య మౌళిక సదుపాయాలు, లాజిస్టిక్స్ సంసిద్ధత కోవిడ్ వ్యాక్సినేషన్ వంటి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో కోవిడ్ 19 కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. కోవిడ్ 19 మహమ్మారి ఇంకా ముగియలేదని..దేశవ్యాప్తంగా పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షించాలని ప్రధాని మోదీ కోరారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్ , వ్యాక్సిన్, కోవిడ్ రూల్స్ వంటి ఐదు అంచెల వ్యూహాన్ని తప్పకుండా కొనసాగించాలన్నారు. 


Also read: Cucumber Benefits: కీరాను తొక్కతో తింటే ఏమౌతుంది, ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook