Covishield Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది ఐసీఎంఆర్. కరోనా వైరస్ మ్యూటేషన్ నేపధ్యంలో రక్షణ కోసం రెండు డోసులు సరిపోవంటోంది. మూడవ డోసు తీసుకోవల్సిన అవసరముందని చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లతో వ్యాక్సినేషన్ (Vaccination)ప్రక్రియ నడుస్తోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువమంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్ధ్యంపై, పనితీరుపై చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే దేశంలో ఇప్పుడు డెల్టా వేరియంట్ భయం పొంచి ఉండటమే. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగానే దేశంలో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి. కోవిషీల్డ్ తీసుకున్నవారు కరోనా బారిన పడుతున్నారు. ఇటువంటి వారిలో యాంటీబాడీలు వేగంగా తగ్గిపోతున్నాయి. అందుకే ఇలాంటి వారికి కోవిషీల్డ్ మూడవ డోసు ఇవ్వాల్సిన అవసరముందని ఐసీఎంఆర్(ICMR)అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు..డెల్టా స్ట్రెయిన్‌ను వేగంగా బలహీనపరుస్తున్నందున కోవిషీల్డ్ మూడవ డోసు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని..ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి రక్షణ పొందవచ్చని ఐసీఎంఆర్ భావిస్తోంది.


కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తరువాత ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలను..డెల్టా వేరియంట్ (Delta Variant) నాలుగున్నర రెట్లు ఎక్కువగా తగ్గించేస్తుంది. రెండవ డోసు తీసుకున్నవారిలో 3.2 రెట్లు తగ్గిస్తుంది. అందుకే కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారు..మూడవ డోసు తీసుకుంటే మంచిదని ఐసీఎంఆర్ నిపుణుడు డాక్టర్ సమీరన్ పాండా చెబుతున్నారు. అయితే కోవిషీల్డ్ (Covishield) మూడవ డోసు ఎప్పుడు తీసుకోవాలనేది ఇంకా నిర్ధారణ కాలేదు. 


Also read; Corona Nasal Vaccine: నాసల్ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు, ఆశలు రేపుతున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook