Cucumber Benefits: చాలామందికి పండ్లు, కూరగాయలు తినే విషయంలో చాలా సందేహాలు తలెత్తుతుంటాయి. ఎలా తినాలనే విషయంపై వివిధ రకాల ప్రశ్నలు వస్తుంటాయి. ముఖ్యంగా కీరా తినే విషయంలో సందేహాలుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమంది కీరాను తొక్కతో సహా తింటుంటే..మరి కొంతమంది తొక్క ఒలిచి తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఎలా తింటే మంచిది, తొక్కతో తినవచ్చా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. కీరా తొక్కలో విటమిన్ కే, విటమిన్ సి సహా చాలా రకాల మినరల్స్ , విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనం కల్గిస్తాయి. అందుకే కీరాను ఎప్పుడూ తొక్కతో సహా తినడమే మంచిది. కీరా తొక్కతో తినాలంటే శుభ్రంగా ఉండటమే కాకుండా ఆర్గానిక్ అయి ఉండాలి. లేకపోతే ఇతర సమస్యలు తలెత్తుతాయి.


కీరాను తొక్కతో సహా తినాలంటే ముందుగా కీరాను బాగా క్లీన్ చేయాలి. ఎందుకంటే కీరాను నిల్వ చేసేందుకు అసహజమైన సింథటిక్ వ్యాక్స్ వినియోగించాలి. ఈ వ్యాక్స్ నేరుగా కడుపులో వెళితే ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. అందుకే కీరాను ఎప్పుడూ తొక్కతో సహా తింటేనే ఆరోగ్యానికి మంచిది. ముందుగా వేడి నీళ్లలో శుభ్రం చేస్తే ఆరోగ్యానికి హాని కలగదు. 


కీరాను తొక్కతో సహా, ఒలవకుండా తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కీరా అనేది ఒక ఫైబర్ ఫుడ్. కీరా తొక్కలోనే ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. అందుకే తొక్క ఒలిచి తింటే ప్రయోజనం చేకూరదు. తొక్కతో సహా తింటేనే కీరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. కీరా తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య పోతుంది. ఇది బౌల్ మూమెంట్‌ను వేగవంతం చేస్తుంది. కడుపు శుభ్రం చేస్తుంది. 


చర్మం ఏజీయింగ్ నియంత్రణ


కీరాను సాధ్యమైనంత ఎక్కువగా ప్రతి డైట్‌లో భాగంగా చేసుకోవాలి. దీనివల్ల స్కిన్ ఏజీయింగ్ ప్రక్రియ అదుపులో ఉంటుంది. దాంతోపాటు కొలేజన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ కీరా తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.


బరువు తగ్గించేందుకు దోహదం


చాలామంది కీరాను బరువు తగ్గించేందుకు తింటుంటారు. నిజంగానే బరువు తగ్గించేందుకు కీరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. డైట్‌లో భాగంగా చేసుకుని కీరా తినడం అలవాటు చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. తొక్కతో కూడిన కీరాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 


Also read: Women Diet: 40 ఏళ్లు దాటిన మహిళలకు ఎదురయ్యే సమస్యలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook