COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cucumber Health Secrets Telugu: దోసకాయలో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతన్నవారికి ఈ దోసకాయ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని హైడ్రేట్‌ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఇందులో ఫైబర్‌ కూడా లభిస్తుంది. ఇది పొట్టకు హాయిని అందిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా ప్రతి రోజు దోసకాయ తినడం వల్ల కలిగే ఇతర లాభాలేంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


బరువు తగ్గడానికి సహాయపడుతుంది: 
దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొట్టను నిండుగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆకలిని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


హైడ్రేషన్: 
దోసకాయలో 96 శాతం నీరు ఉంటుంది. వేసవిలో తరచుగా శరీర వేడి వంటి సమస్యలతో బాధపడేవారు దీనిని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా హైడ్రేషన్‌ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


జీర్ణ వ్యవస్థకు మేలు: 
దోసకాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కూడా ఎంతో సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


చర్మ ఆరోగ్యం: 
దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షించేందుకు సహాయపడతాయి. దీంతో పాటు ముడతలు పడకుండా నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కళ్ల ఆరోగ్యానికి మేలు: 
దోసకాయలో విటమిన్ కె కూడా లభిస్తుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఎలాంటి కంటి చూపు సమస్యలైనా తొలగిపోతాయి. 


రక్తపోటును నియంత్రిస్తుంది: 
దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో సిలికా కూడా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించేందుకు కీలక పాత్ర పోస్తుంది. అంతేకాకుండా ఎముకలను కూడా దృఢంగా చేస్తుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.