Drink Curry Leaves Boiled Water: ప్రతి వంటగదిలో కరివేపాకు ఉంటుంది. ప్రతి ఒక ఆహారంలో భారతీయులు దీనిని వినియోగిస్తారు. ఇది రుచిని పెంచడమేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దక్షిణ భారత దేశంలో సాంబార్‌తో మొదలై నాన్‌వెజ్‌ కర్రీల దాకా వినియోగిస్తారు. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ సి, కెరోటిన్, కాల్షియం, ఐరన్ వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ ఆకులను నీటిలో మరిగించి తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీటిని ప్రతి రోజు తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరివేపాకు మరిగించి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
❃ కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి ఉదయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


❃ అధిక బరువుతో బాధపడుతున్నవారికి కూడా కరివేపాకు నీరు ప్రభావంతంగా సహాయపడుతుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా రోజుకు రెండు సార్లు కరివేపాను నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ పరిమాణంలో కేలరీలు లభిస్తాయి. దీంతో బెల్లీ ఫ్యాట్‌ కూడా కరుగుతుంది. 


Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?


❃ తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు కరివేపాకు నీటి తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. గుండె సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తీసుకోండి.


❃ కరివేపాకులో పీచుపదార్థం ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు కరివేపాకు నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook