Curry Leaves Juice Benefits on Empty Stomach: కరివేపాకు ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. కరివేపాకులో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి పోషకాలు లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖాళీ కడుపుతో కరివేపాకు రసం తాగితే ఎన్ని ప్రయోజనాలో?:


బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకునేవారు కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి కష్టం లేకుండా, వ్యాయామాలు లేకుండా ఇలా ఖాళీ కడుపుతో ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్‌ పరిమాణాలు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.


రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన, పోషకాలు లేని ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలో బాధపడేవారు తప్పకుండా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కరివేపాకు రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. 


Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


జీర్ణ సమస్యలకు చెక్‌:
కరివేపాకు రసం ఖాళీకడుపుతో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి తీవ్ర పొట్ట సమస్యలతో పాటు జీర్ణక్రియ సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం, పొట్ట నొప్పి వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Protein Rich Veg Foods: మాంసాహారం కంటే ఎక్కువగా ప్రోటీన్లు లభించే శాకాహార పదార్ధాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook