Dangerous Herbs: వేసవిలో వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు.. లేదంటే అంతే!
Dangerous Herbs: ఆహారంలో రుచి కోసం అనేక మసాలాలను యాడ్ చేస్తుంటారు. కానీ, మసాలాలాను అతిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dangerous Herbs: ఆహారంలో రుచిని పెంచేందుకు మనలో చాలా మంది మసాలాలను వాడుతుంటారు. అయితే అలాంటివి వేసవిలో అతిగా తినడం హానికరం. వీటి వల్ల కడుపులో కొంత అసౌకర్యం కలుగుతుంది. అయితే వేసవిలో ఎక్కువగా మసాలా వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మసాలాలు అతిగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్యం సమస్యలేంటో తెలుసుకుందాం.
తులసి
తులసి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఇది యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. కానీ వేసవిలో దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కడుపులో వేడి పెరుగుతుంది. దీంతో ఇది కడుపు ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.
బిర్యానీ ఆకులు
వేసవిలో బిర్యానీ ఆకుల వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇందులో శరీర ఉష్ణోగ్రతను పెంచే గుణం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని వల్ల అల్సర్ వంటి సమస్యల అభివృద్ధికి కూడా దారితీస్తుంది.
ఒరేగానో..
శీతాకాలంలో ఒరేగానో తీసుకోవడం చాలా మంచిది. కానీ వేసవిలో దీన్ని తీసుకోవడం హానికరం. ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడే ఇటాలియన్ హెర్బ్. కానీ వేసవిలో పొట్ట, పేగుల్లో వేడిని పెంచి నోటిలో పుండ్లు కలిగే ప్రమాదం ఉంది.
Also Read: Ashoka Tree for Diabetes: అశోక చెట్టు బెరడులో డయాబెటిస్ మటుమాయం..!
ALso Read: Cold Water Side Effects: వేసవిలో చల్లని నీరు తాగారో.. ఈ వ్యాధులు కొని తెచ్చుకున్నట్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.