COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dates Health Benefits: శీతాకాలం చాలా మంది తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఎందుకంటే వాతావరణంలో తేమ ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా సీజనల్‌ వ్యాధులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇలాంటి సమయంలో ఖర్జూరాను తీవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పోషకాల లోపం నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. శీతాకాలంలో ప్రతి రోజు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఎముకలకు మేలు చేస్తుంది:
చలికాలంలో చాలా మందిలో ఎముకల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రతి రోజు  ఖర్జూరాలను తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముఖలను దృఢంగా ఉంచుతాయి. దీంతో పాటు దంతాల సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా క్యాల్షియం లోపం కూడా తొలగిపోతుంది. కాబట్టి తరచుగా ఎముకల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రెగ్యూలర్‌గా తీసుకోవాలి.


గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి గుండెను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతి రోజు అల్పాహారంలో ఖర్జూరాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా   


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
చలి కాలంలో అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలతో పాటు జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తాయి. ఖర్జూరంలో కరిగే ఫైబర్‌ కూడా లభిస్తుంది. దీని కారణంగా మలబద్ధకం, ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


బరువు తగ్గిస్తుంది:
ఖర్జూరంలో కేలరీలు తక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు శీతాకాలంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ పరిమాణాలు కూడా లభిస్తాయి.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook