Covaxin for Kids: 6 నుండి 12 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. కొవాగ్జిన్‌కి DCGI అనుమతి
COVID-19 vaccine for Kids: పన్నెండేళ్లలోపు పిల్లలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది DCGI.దీంతో ఇకనుండి పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు మినహా అన్ని వయసుల వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
COVAXIN Vaccine for 6 to 12 Years Kids: కరోనా మహమ్మరి భయం ఇంకా మనలను వెంటాడుతునే ఉంది. చైనా,అమెరికాతో పాటు ఇతర దేశాలలో కరోనా పోర్త్ వేవ్ విజృభించడంతో భారత్ అప్రమత్తం అయింది.మన దేశంలో కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలు చేపట్టింది.ఇప్పుటికే మూడు వేవ్ లతో భయపెట్టిన కరోనా ఇప్పుడు నాలుగో వేవ్ కూడా రాబోతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో కరోనా కట్టడి కోసం అందరికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 12 యేళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా ఇప్పుడు 6నుండి పన్నెండేళ్లలోపు పిల్లలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది DCGI.దీంతో ఇకనుండి పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు మినహా అన్ని వయసుల వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలో కరోనా కంట్రోల్ అదుపులోనే ఉన్న కరోనా కేసుల సంఖ్య పిల్లల్లో ఈవైరస్ అధికంగా కనిపిస్తుండడంతో పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమయింది.2నుండి 12ఏళ్ల పిల్లలకు తమ కోవాగ్జీన్ వ్యాక్సిన్ ఇవ్వాడానికి అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ DCGIకి ప్రతిపాదనలు పంపింది . భారత్ బయోటెక్ పంపిన ప్రతిపాదనలపై ఎక్స్ పర్ట్ కమిటీ సమావేశం అయి కోవాగ్జీన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.పాజిటివిటీ రేటు,మరణాల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుదల కారణంగా నాలుగవ వేవ్ వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన కే౦ద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్‌తో పాటు వ్యాక్సిన్ అందించేందకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఇప్పటివరకు 18ఏళ్లు నిండినవారికి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందించారు.అవసరమైన వారికి బూస్టర్ డోస్ కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం 12నుండి 18ఏళ్ల యువకులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. నాలుగవ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కరోనావైరస్ (COVID-19) కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం.
Also Read:Karnataka Bible Controversy: హిజాబ్ ఘటన తర్వాత కర్ణాటకలో ఇప్పుడు మరో వివాదం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.