Delta Plus Variant Of Covid-19: ప్రపంచ వ్యాప్తంగా 85 దేశాలలో డెల్టా కరోనా వేరియంట్ కేసులు నమోదైనట్లు రెండు వారాల కిందటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే డెల్టా వేరియంట్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న తరుణంతో తలెత్తిన మరో సవాల్ డెల్టా ప్లస్ వేరియంట్. ఆల్ఫా, డెల్టా, డెల్టా వేరియంట్ కేసులపై అధ్యయం జరుగుతుందని ప్రముఖ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెల్టా మరియు డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ మరింత ప్రమాదకరమని, దీని ద్వారా కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుందని.. ఇది ప్రాణాంతకమని సైతం గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా (AIIMS Director Dr Randeep Guleria) పలు విషయాలు షేర్ చేసుకున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Variant of Covid-19) ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనాలు జరుగుతున్నాయని, కానీ ఇది ప్రమాదకరమని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలని సూచించారు.


Also Read: India Corona Updates: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, 1000 దాటిన మరణాలు 


రోగనిరోధక శక్తికి అందకుండా మనిషిని మరింత బలహీనం చేస్తుందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పుడే ఓ నిర్ధారణకు రాకూడదని చెప్పారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో అత్యధిక కేసులు రావడానికి కారణమైన వేరియంట్ డెల్టా అని, దాని నుంచే డెల్టా ప్లస్ కోవిడ్19 (COVID-19) వేరియంట్ పుట్టుకొచ్చిందని మాత్రమే సమాచారం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ బాధ్యతగా కరోనా టీకాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మిక్సింగ్ డోసుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. కానీ కొన్ని అధ్యయనాలు పరిశీలిస్తే.. వ్యాక్సిన్ల మిక్సింగ్ డోసులతో ప్రయోజనం ఉందని, అదే సమయంలో దుష్ప్రరిణామాలు సైతం ఉన్నాయని డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. 


Also Read: LPG Cylinder Price: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు, ఆయా నగరాలలో లేటెస్ట్ ధరలు ఇలా


ప్రస్తుతానికి డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ గుంచి ఆందోళన అక్కర్లేదన్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడం, కోవిడ్19 నిబంధనలైన భౌతికదూరం పాటించడం, ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను పదే పదే శుభ్రం చేసుకోవడం లాంటివి పాటించడం ద్వారా ప్రయోజనం ఉంటుందన్నారు. అంత త్వరగా కొత్త కరోనా వేవ్ రాకుండా ఈ చర్యలు అడ్డుకుంటాయని అభిప్రాయపడ్డారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook