Dengue Prevention In Monsoon: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీంతో వాతావారణంలో మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా తేమ శాతం కూడా పెరిగిపోయింది. దీని వల్ల దోమలు, కీటకాలు కూడా విస్తరంగా వ్యాప్తి చెందుతాయి. వర్షాకాలంలో ఈ కీటకాల వల్ల దోమలు మరింత వ్యాప్తి చెంది డెంగ్యూ వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలాని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  సిట్రస్ ఫుడ్స్ పుష్కలంగా ఉన్న అన్ని రకాల ఆహారాలు తీసుకుంటే డెంగ్యూ వ్యాధితో పోరడే  తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారం తింటే వ్యాధితో పోరడే కణాలు పెరుగుతాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి డెంగ్యూ వ్యాధి నుంచి సంరక్షిస్తాయి:


అల్లం (Ginger):


అల్లం టీకి రుచిని పెంచేందుకు కృషి చేస్తుంది. అల్లంలో ఉండే మూలకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకుంటే  గొంతు నొప్పి, వాపు, వికారం, డెంగ్యూ జ్వరం వంటి సమస్యలు దూరమవుతాయి.


పసుపు (Turmeric):


పసుపును యాంటీబెటిక్‌గా వినియోగిస్తారు. అంతేకాకుండా దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు. ఇందులో ఔషధ గుణాలున్నాయని దీనిని ఆహారం వండే క్రమంలో వినియోగిస్తే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు పూర్కొన్నారు. అంతేకాకుండా డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి సంరక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.



వెల్లుల్లి (Garlic):


వెల్లుల్లి ఆయుర్వేద శాస్త్రంలో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. దాదాపు ప్రతి భారతీయ వంటకాల్లో దీనిని వినియోగిస్తారు. ఇందులో శరీర రోగనిరోధక శక్తిని పెంచే మూలకాలున్నాయి. ఇది వ్యాధుల నుంచి సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.


పెరుగు (Curd):


పెరుగు శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుచుతాయి. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రెడ్‌గా ఉంచడమేకాకుండా అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.


బాదం (Almond):


బాదం నట్స్‌లో చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో  విటమిన్ ఇ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యవంతంగా చేస్తుంది. కావున వానా కాలంలో ప్రతి ఒక్కరు బాదం తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Read also: Cherries For Weight Loss: ఏం చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే రోజూ వీటిని తినండి..!


Read also: Cervical Pain Treatment: ఎన్ని మందులు వాడిన మెడ నొప్పులు తగ్గడం లేదా.. అయితే ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook