Dengue Treatment Home Remedies: వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరం, మలేరియా, డెంగీ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా పిల్లలు వ్యాధిబారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే, ఈ సీజన్‌లో డెంగీ వ్యాధి వస్తే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెంగీతో బారిన పడేవారికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యగా జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు కనిపిస్తాయి. ఒక్కోసారి లక్షణాలు కొద్దిగా కనిపించినా డెంగీ వస్తుంది. పిల్లలు త్వరగా డెంగీ వ్యాధి నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 


హైడ్రేటెడ్‌..
డెంగీ బారిన పడిన పిల్లలు ముఖ్యంగా జ్వరం వచ్చిన 24 గంటల తర్వాత నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తరచూ జ్వరం వస్తుంది. హఠాత్తుగా తగ్గిపోతుంది. డెంగీ కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారుతుంది. ఆ సమయంలో నిమ్మరసం, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, ఇంట్లో తయారు చేసుకునే సూప్స్‌ వంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం పెడుతూ ఉండాలి.


ఇమ్యూనిటీ బూస్టింగ్‌..
డెంగీ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలంటే ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా మారాలి. బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థ ఉంటే జ్వరం కూడా త్వరగా తగ్గిపోతుంది. అందుకే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు సిట్రస్‌ పండ్లు, బాదం, పసుపు వంటివి మన డైట్లో చేర్చుకోవాలి.


ఇదీ చదవండి:  ఈ 4 సూపర్ ఫుడ్స్ తో మంచి నిద్ర.. గుండె ఆరోగ్యం.. మీ డైట్లో ఉన్నాయా?


మెంతి నీరు..
డెంగీ ఫీవర్‌తో మీ పిల్లలు బాధపడుతున్నట్లయితే మెంతుల నీరు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెంతులను ఉడకబెట్టి ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత రోజుకు రెండు సార్లు డెంగీతో బాధపడుతున్న పిల్లలకు తాగించాలి. ఈ మెంతి నీరు జ్వరం త్వరగా తగ్గిస్తుంది, అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. 


గిలోయ్‌ జ్యూస్‌..
గిలోయ్‌ జ్యూస్‌ కూడా డెంగీ నివారణకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. గిలోయ్‌ జ్యూస్‌ ఇమ్యూనిటీ వ్యవస్థను, మెటబాలిజం రేటును బూస్ట్‌ చేస్తుంది. గిలోయ్‌ జ్యూస్‌ ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ను పెంచేస్తుంది. డెంగీ వ్యాధితో బాధపడుతున్నవారికి ముందుగా ప్లేట్‌ లెట్‌ కౌంట్స్‌ తగ్గిపోతాయి. గిలోయ్‌ జ్యూస్‌ కాండం తీసుకుని వేడి నీళ్లలో వేసి బాగా ఉడికించుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడూ ఈ నీటిని తీసుకోవాలి.


నల్ల మిరియాలు..
డెంగీతో బాధపడుతున్న పిల్లలకు నల్ల మిరియాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మిరియాల్లో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాదు తులసి కధా కూడా డెంగీ నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి తులసి ఆకులను నాలుగు తీసుకుని వేడి చేసి మరుగుతున్న సమయంలో నల్ల మిరియాలు కూడా వేయాలి. ఆ నీటిని వడకట్టి తాగించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి:  ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరం.. వండుకునే ముందు తస్మాత్ జాగ్రత్త..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి