Desi Ghee Benefits: ప్రతి ఇంట్లో దాదాపుగా నెయ్యి లేదా నెయ్యితో తయారు చేసిన పదార్థాలు కచ్చితంగా ఉంటాయి. చాలా మంది నెయ్యిని ఇష్టంగా తింటుంటారు. కానీ, నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు అధికంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే నెయ్యి ప్యాకెట్లను కాకుండా దేశీ నెయ్యిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీ నెయ్యి వినియోగంపై నిపుణుల అభిప్రాయం?


దేశంలోని ప్రముఖ పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్‌పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దేశీ నెయ్యి తినడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే, మీరు దాని నుండి అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆమె చెబుతున్నారు. 


ఉదయం ఖాళీ కడుపుతో దేశీ నెయ్యి తినడం వల్ల కలిగే 6 ప్రయోజనాలు..


1. ఖాళీ కడుపుతో నెయ్యి తినడం చర్మానికి ప్రయోజనకరంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల ముఖ తేజస్సు పెరుగుతుంది.


2. దేశీ నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. కాబట్టి పొట్టకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


3. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తినడం వల్ల పొట్టలో మంచి ఎంజైమ్ లు పెరగడానికి సహకరిస్తుంది.


4. మలబద్ధకం ఉన్నవారు ఉదయాన్నే నెయ్యి తింటే శ్రేయస్కరం. ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది.


5. దేశీ నెయ్యి ఆకలిని నియంత్రిస్తుంది. దీని వల్ల శరీర బరువు తగ్గడానికి సహకరిస్తుంది.


6. నెయ్యి తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో బలహీనత ఉండదు.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికలు, చిట్కాల నుంచి గ్రహించినది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Diabetes: డయాబెటిస్ సమస్యగా ఉందా..ఈ జ్యూస్‌లు తాగితే చాలు


Also Read: Tulsi Water Benefits: తులసి నీళ్లతో మధుమేహం తగ్గించుకోవచ్చని తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.