Diabetes Food Tips: డయాబెటిస్ ఉన్నవారు వైట్‌రైస్ తినడం మంచిదేనా? ఇలా వండుతే బోలెడు లాభాలు !
White Rice For Diabetes: వైట్‌రైస్ ఆహారంలో ముఖ్యమైనది. దీని భారతీయలు మూడుపూటలు ఆస్వాదిస్తారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ తినవచ్చా? లేదా అనే సందేహం కలుగుతుంది. అయితే దీని ఎలా తీసుకోవాలి? ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనేది తెలుసుకుందాం.
white Rice For Diabetes: డయాబెటిస్,. అధిక బరువు, రక్తపోటు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి వైట్ రైస్ తినడం మానేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో, బరువు పెరగకుండా ఉంటామని భావిస్తారు. కానీ ఆయుర్వేద నిపుణులు ప్రకారం వైట్ రైస్‌ను ఉపయోగిస్తూ షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
వైట్‌రైస్ మన భారతయులకు సాధారణ, ప్రధాన ఆహారం. ఇందులో కార్యోహైడ్రేట్స్ అధికంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి. అంతేకాకుండా శరీరాని దృఢంగా, శక్తివంతంగా ఉండేలా చేస్తాయి.
అలాగే ఈ వైట్ రైస్‌లో గ్లూటెన్ ఉండదు.ఇందులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, ఐరన్ వంటి పోషకాలు సమృధిగా దొరుకుతాయి. ఇందులో సోడియం లెవెల్స్ అతి తక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు దీని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.
అయితే దీని తయారు చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణులు వైట్ రైస్‌ను ఎలా తయారు చేసుకొని తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి అంటే.. అన్నం తయారు చేసుకొనే ముందు బియ్యాన్ని వేయించుకోవడం లేదా అధిక శాతం నీరుతో శుభ్రం చేయడం వల్ల అద్భుత ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయి. దీని కోసం మీరు ముందుగా బియ్యాన్నిఒక పాన్‌లో వేసి చిన్న మంటతో వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులోని పిండి పదార్థాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకుండా బియ్యం అనేది జిగటగా ఉండదు, పొడిపొడిగా తయారు అవుతుంది. ఈ బియ్యాన్ని డయాబెటిస్‌తో బాధపడేవారు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది.
అన్నం వండే సరైన విధానం:
బియ్యాన్ని శుభ్రం చేసుకోవడం: బియ్యాన్ని శుభ్రమైన నీటిలో కనీసం రెండు నుంచి మూడు సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల బియ్యం మీద అంటుకున్న మట్టి, ఇతర కణాలు తొలగిపోతాయి.
నీరు, బియ్యం నిష్పత్తి: సాధారణంగా ఒక కప్పు బియ్యానికి రెండు నుంచి రెండున్నర కప్పుల నీరు సరిపోతుంది. మీరు ఇష్టపడే అన్నం రకం (పొడిగా లేదా మెత్తగా) ఆధారంగా ఈ నిష్పత్తిని కొద్దిగా మార్చుకోవచ్చు.
ఉప్పు, నెయ్యి: రుచి కోసం కొద్దిగా ఉప్పు వేయవచ్చు. అలాగే, నెయ్యి వేయడం వల్ల అన్నం మరింత రుచికరంగా ఉంటుంది.
ఉడికించడం: బియ్యం, నీరు, ఉప్పు (నెయ్యి ఉంటే అది) ఒక పాత్రలో వేసి మంట మీద ఉంచాలి. నీరు మరిగి, బియ్యం ఉడికిన తర్వాత మంటను తగ్గించి, కుక్కర్ కుక్ చేయించవచ్చు లేదా కప్పు తొడుగుతో మూత పెట్టి, అన్నం నీరు పీల్చుకోవడానికి అనుమతించాలి.
పొడిగా లేదా మెత్తగా: మీరు పొడిగా ఉండే అన్నం ఇష్టపడితే, అన్నం నీరు పీల్చుకున్న తర్వాత కొద్దిసేపు వేడి మీద ఉంచండి. మెత్తగా ఉండే అన్నం ఇష్టపడితే, మంట ఆపి, కుక్కర్ నుంచి తీసి వెంటనే వడ్డించండి.
అన్నం మాత్రమే తినడం ఆరోగ్యకరం కాదు. సమతుల్య ఆహారంలో అన్నంతో పాటు కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు కూడా తీసుకోవాలి. బరువు తగ్గాలంటే కేవలం అన్నం తినడం మాత్రమే సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం రెండూ ముఖ్యం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, ఆహారం గురించి డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, డాక్టర్‌ని సంప్రదించండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి