Fenugreek Seeds For Diabetes: మెంతులు ప్రతి వంటకంలో భారతీయులు వినియోగిస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే మూలకాలు వంటకాన్ని రుచిగా చేయడానికి సహాయపడుతుంది. అయితే ఉండే గుణాలు ఆహారాలును రుచి చేయడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి అనేక వ్యాధులకు ఔషధగా పని చేస్తుంది. ఇందులో బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు లభిస్తాయి. ఇవి మధుమేహంతో పాటు గుండె సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా కరిగించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో తయారు చేసిన ఆహారాలను ప్రతి రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహంతో బాధపడుతున్నవారు మెంతులను ఇలా తీసుకోవాలి:
మెంతుల టీ తాగాల్సి ఉంటుంది:

మధుమేహంతో బాధపడుతున్నవారు మెంతుల టీని తప్పకుండా తాగాల్సి ఉంటుంది. ఈ టీని తాయారు చేసుకోవడానికి ఒక పాన్‌ తీసుకుని అందులో కప్పు నీరు వేసి మరిగించాలి. అందులోనే ఒక చెంచా మెంతి గింజలను వేసి బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఇలా 20 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఒక కప్పులో తీసుకుని అందులో తేనె కలుపుకుని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రతి రోజూ తాగడం వల్ల మధుమేహంతో బాధపడుతున్నవారికి రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఊబకాయం సమస్యల నుంచి కూడా ఉపమనం లభిస్తుంది.


మెంతికూరను నీటిని ఉడకబెట్టి తాగడం:
మెంతి ఆకులను నీటిని వేసి ఉడికించి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక కప్పు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తప్పకుండా ఈ మెంతి ఆకులతో తయారు చేసిన నీటిని తాగాల్సి ఉంటుంది.


మెంతి పరాటా తినండి:
మధుమేహం రోగులు మెంతి ఆకులనుయ ఉపయోగించి తయారు చేసిన పరాటాలను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. వీటిని ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. మెంతి పరోటా తినడం వల్ల బీపీ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!


Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook