Aparajita Flowers: ఈ నీలి రంగు పూలతో కాడా చేసుకుని తాగితే డయాబెటిస్ ఇట్టే మాయం
Aparajita Flowers: మధుమేహం..ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తోంది. ఇండియాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి కచ్చితంగా డయాబెటిస్ ఉంటుందని అంచనా. కేవలం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి దీనికి ప్రధాన కారణం. మరి ఈ ప్రమాదకర వ్యాధి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
Aparajita Flowers: మధుమేహానికి ఇప్పటి వరకూ పూర్తి చికిత్స లేదు. ఒకసారి వచ్చిదంటే మందులు వాడుతూ, ఆహారపు అలవాట్లు నియంత్రించుకోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ప్రకృతిలో లభించే కొన్ని మొక్కలు, పూలలో డయాబెటిస్ దూరం చేసే అద్భుతమైన గుణాలున్నాయి. అందులో కీలకమైంది నీలం రంగులో ఉండే అపరాజిత పూవు.
డయాబెటిస్ లెవెల్స్ పెరుగుతుంటే ఇన్సులిన్ వినియోగించుకోవల్సి వస్తుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మాత్రం ప్రకృతిలో కొన్ని అరుదైన పదార్ధాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ప్రారంభదశలో అపరాజిత పూలతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రోజూ క్రమం తప్పకుండా అపరాజిత పూలను సేవిస్తే సహజసిద్ధంగానే డయాబెటిస్ నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచవచ్చు. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫెనోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో దోహదం చేస్తుంది.
ఆపరాజిత పూలతో కాడా తయారు చేసుకుని సేవించవచ్చు. దీనికోసం కొన్ని తాజా పూలను తీసుకుని నీటిలో ఉడికించాలి. ఈ కాడాను రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. అపరాజిత పూల కాడా తాగడం వల్ల మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి దూరమౌతుంది. ఇందులో యాంటీ డిప్రెజంట్ గుణాలు పెద్దఎత్తున ఉంటాయి. మెదడు కణాల పనితీరు మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది.
అపరాజిత పూలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెద్దఎత్తున ఉండటం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. చర్మం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. చర్మంపై ముడతలు దూరమౌతాయి. పింపుల్స్, యాక్నే వంటి సమస్యలు దూరమౌతాయి.
Also read: Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.