Diabetes Medicine: మధుమేహం, కొలెస్ట్రాల్ రెండూ ప్రమాదకరమైనవే. మధుమేహం కారణంగా రక్త నాళికలు దెబ్బతినడంతో కొలెస్ట్రాల్ అక్కడ పేరుకుపోతుంటుంది. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. అందుకే డయాబెటిస్, కొలెస్ట్రాల్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమౌతుంది. ఈ రెండింటినీ నియంత్రించేందుకు వివిధ రకాల మందులు వాడి అలసిపోతుంటారు. అటు మధుమేహానికి కూడా ఇప్పటి వరకూ పూర్తి చికిత్స లేదు. మందులు వాడుతున్నంతవరకూ అదుపులో ఉంటుంది. ఇప్పుడిక పరిశోధకులు మధుమేహానికి కొత్త మందు కనిపెట్టేశారు. ఆయుర్వేద పరిధిలో వచ్చే ఈ మందుతో అటు డయాబెటిస్ ఇటు కొలెస్ట్రాల్ రెండింటికీ చెక్ చెప్పవచ్చు. 


ఈ అద్భుతమైన మందు అందరి ఇళ్లలో లభంచేదే. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ రెండింటినీ సులభంగా తగ్గిస్తుంది. ఆదే దాల్చిన చెక్క పౌడర్. డయాబెటిస్, కొలెస్ట్రాల్ నియంత్రణలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కేవలం 40 రోజుల్లో డయాబెటిస్, కొలెస్ట్రాల్ తగ్గుతుందంటున్నారు. 


దీనికి సంబంధించిన అధ్యయనం బ్రిటన్‌లో జరిగింది. మధ్య వయస్సుకు చెంంది 60 మందికి 40 రోజులపాటు రోజుకు 3-6 గ్రాముల దాల్చిన చెక్క పౌడర్ తిన్పించి చూసినపపుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ 24 శాతం తగ్గిపోయింది. కొలెస్ట్రాల్ లెవెల్స్ 18 శాతం తగ్గింది. ఈ 40 రోజులు వేరే ఏ మందులు ఇవ్వలేదు. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే రెండు వారాల్లో ప్రీ డయాబెటిక్ పరిస్థితులు తొలగిపోవడాన్ని గమనించారు. 


రోజూ కేవలం 1 గ్రాము దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అద్భుతంగా పెరగడాన్ని పరిశీలించారు. దాల్చిన చెక్క పౌడర్‌తో ఆరోగ్యపరంగా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. 


Also read: Fennel Seeds Benefits: రోజూ పరగడుపున సోంపు నీళ్లు తాగితే ఏమౌతుందో ఉహించలేరు మీరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook