Ayurvedic Cure for Diabetes In 50 Days: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే మధుమేహంలో రెండు రకాలుగా ఉంటాయి. మొదటి టైప్-1 అయితే రెండవది టైప్-2 మధుమేహం. మానవ శరీరానికి రెండు ప్రమాదకరమే. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మిమ్మల్ని జీవితాంతం వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురి చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత తొందరగా బయట పడితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే శరీరం తీవ్ర అనారోగ్య బారిన పడే అవకాశాలున్నాయి. మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఆయుర్వేద చిట్కాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మెంతులు, మిరియాలను కూడా వినియోగించవచ్చు. వీటిని నుంచి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


మెంతికూర:
మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి మెంతి ఆకులతో చేసిన కూరను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా తగ్గుతుంది.  ఊబకాయం, కొలెస్ట్రాల్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.


నల్ల మిరియాలు:
నల్ల మిరియాల్లో పైపెరిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది.


దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇన్సులిన్ తగ్గించి మధుమేహం సమస్యల నుంచి రక్షణ కలిపిస్తుంది. అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గించేందు సహాయపడుతుంది.  


అల్లం:
అల్లంలో యాంటీ డయాబెటిక్, హైపోలిపిడెమిక్, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇది జీవక్రియను మెరుగుపరచి షుగర్‌ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!


Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook