Diabetes Diet: డయాబెటిక్ రోగుల క్రమం తప్పకుండా వీటిని ఆహారంగా తీసుకోవాలి..!
Diabetes Diet: భారతదేశంలో రోజురోజూకు డయాబెటిక్ రోగుల సంఖ్య పెరిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య బారిన చాలా మంది పడుతున్నారు. ఈ డయాబెటిక్ నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషదాలున్నాయి.
Diabetes Diet: భారతదేశంలో రోజురోజూకు డయాబెటిక్ రోగుల సంఖ్య పెరిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య బారిన చాలా మంది పడుతున్నారు. ఈ డయాబెటిక్ నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషదాలున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల ఆహార నియమాలను కూడా పాటించాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ తీసుకునే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
ఈ కింది ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి:
మునగ చోఖా:
మునగకాయను ఎక్కువగా సౌత్ ఇండియన్ డిష్ అయిన సాంబార్‌లో వినియోగిస్తారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవక్రియను బలపరిచి.. జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది.
అరటిపండు బ్రైట్:
డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. రెగ్యులర్ పచ్చి అరటిపండ్లను తినాలి. అందులో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్ మెయింటెన్ చేయడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
ఉసిరికాయ రసం:
ఉసిరికాయను ఆయుర్వేద నిధిగా పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తుంది.
కాకరకాయ రసం:
ఇది చేదు కూరగాయ అయినప్పటికీ.. ఇందులో చాలా రకాల ఔషధ గుణాల ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు క్రమం తప్పకుండా దీని రసాన్ని తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook