When To Exercise With Diabetes: ప్రస్తుతం చాలామందిలో మధుమేహం సమస్యలు రావడానికి కారణాలు ఆధునిక జీవనశైలైనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వీకుల్లో 60 సంవత్సరాల తర్వాత మధుమేహం సమస్యలు వచ్చేవని.. కానీ ప్రస్తుతం  30 ఏళ్ల వారు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగితే శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు జీవనశైలిలో మార్పులు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి పాటించే చాలామంది శరీరాల్లో ఇన్సులిన్ తేడాల కారణంగా శరీర అవయవాలు గ్లూకోస్ పేరుకు పోతోంది. తద్వారా చాలామందిలో టైప్ 2 డయాబెటిస్ కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల శరీరక శ్రమ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా.. శరీరంలోని చక్కర పరిమాణాలు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 


Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు  



అయితే మధుమేహం కారణంగా చాలామందిలో అధిక రక్తపోటుతో పాటు గుండె దెబ్బ తినడం, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన సలహాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్న చాలామంది తరచుగా ఒకే చోట కూర్చుని ఉంటారు. ఇలా ఉండడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉదయం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది దీంతోపాటు 25 నిమిషాల పాటు యోగ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి రోజు ఆరోగ్యకర ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తింటూ ఉంటారు. డయాబెటిస్ ఉన్నవారు ఇలా ఆహారాలు తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్న వారిలో జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి