Diabetes Precautions: ఇటీవలి కాలంలో మధుమేహం తీవ్రత పెరుగుతోంది. దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇదొక లైఫ్‌స్టైల్ వ్యాధి. ఇందులో ఇప్పటి వరకూ మనం టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అనే రెండు రకాల గురించి విన్నాం. కానీ ఇప్పుడు మధుమేహం టైప్ 1.5 డయాబెటిస్ పేరుతో కొత్త రూపం దాల్చిందనే సంగతి మీకు తెలుసా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టైప్ 1.5 డయాబెటిస్ అనేది ఓ ప్రమాదకర వ్యాధి. ఇది కూడా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లాంటిదే. కానీ సరిగ్గా డయాగ్నోసిస్ చేయడం కష్టమౌతుంటుంది. దీనినే ఆటోఇమ్యూన్ డయాబెటిస్ అని కూడా పిలుస్తున్నారు. అసలీ టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి, ఎలా గుర్తించాలి, ఏం చేయాలనేది తెలుసుకుందాం


డయాబెటిస్ మెలిటస్ అనేది ఓ రకమైన గ్రూప్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమౌతుంటుంది. వాస్తవానికి డయాబెటిస్ 10 కంటే ఎక్కువ రకాలున్నాయి. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక ఆాటో ఇమ్యూన్ స్టితి. ఇది శరీరం ఇమ్యూనిటీ వ్యవస్థలో సెల్స్‌పై దాడి చేస్తుంది. హార్మోన్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటం లేదా అస్సలు లేకపోవడం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ కన్వర్షన్‌కు ఇన్సులిన్ ఉపయోగపడుతుంది.  టైప్ 1 డయాబెటిస్ వ్యక్తులకు రోజూ ఇన్సులిన్ మందు అవసరం. 


టైప్ 2 డయాబెటిస్ అనేది ఆటో ఇమ్యూన్ సమస్య కాదు. శరీరంలో కణాలు సమయానుకూలంగా ఇన్సులిన్ రెసిస్ట్ అయినప్పుడు తలెత్తుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో రక్తంలో కన్వర్షన్ ప్రక్రియ జరగకపోవడంతో డయాబెటిస్ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇది పిల్లలు, యువకుల్లో వేగంగా వ్యాపిస్తుంది. 


టైప్ 1.5 డయాబెటిస్  అనేది ఇమ్యూనిటీ సిస్టమ్..ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసినప్పుడు తలెత్తుతుంది. టైప్ 1.5 వ్యక్తులకు ఇన్సులిన్ అవసరం వెంటనే ఉండదు. ఎందుకంటే క్రమ క్రమంగా ఈ సమస్య పెరుగుతుంది. టైప్ 1.5 డయాబెటిస్ సోకిన దాదాపు ఐదేళ్ల తరువాత ఇన్సులిన్ అవసరం రావచ్చు. 


టైప్ 1.5 లక్షణాల గురించి పరిశీలిస్తే ఎక్కువగా దాహం వేయడం, తరచూ మూత్రం రావడం, అలసట పెరగడం, మసకగా కన్పించడం, అకారణంగా బరువు తగ్గడం వంటివి ఉంటాయి. 


Also read: Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం నిర్లక్ష్యం చేస్తే శరీరం మొత్తం గుల్లే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook