Diabetes precautions: మధుమేహం వ్యాధిగ్రస్థులు మష్రూం తినవచ్చా లేదా
Diabetes precautions: మధుమేహం ఓ ప్రమాదకరమైన వ్యాధి. ఇటీవలి కాలంలో దేశంలోనే కాదు ప్రపంచమంతా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diabetes precautions: మధుమేహం ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంది. మందుల ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది తప్ప నయం కాదు. అదే సమయంలో ఆహారపు అలవాట్లపై మధుమేహం వ్యాధిగ్రస్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏం పడితే అది తినకూడదు. ఈ క్రమంలో మష్రూం తినవచ్చా లేదా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉంటుంటాయి.
మధుమేహం వ్యాధిగ్రస్థులు ఎప్పుడూ డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే పదార్ధాలు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగాపెరిగిపోతుంటాయి. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలపై ప్రత్యేకంగా శ్రద్ధ ఉండాలి. అందుకే చాలామంది ఇష్టంగా తినే మష్రూంలను డయాబెటిస్ రోగులు తినవచ్చా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. చాలామంది ఈ అనుమానంతోనే మష్రూంలను దూరం పెడుతుంటారు. కానీ వాస్తవానికి మష్రూం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ రోగికి లాభం చేకూరుస్తుంది.
మష్రూం అనేది ఓ రకమైన సూపర్ ఫుడ్. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ తక్కువ. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అంటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. కేలరీలను నియంత్రిస్తుంది. మష్రూంలో పంచదార, కార్బోహైడ్రేట్లు సమానంగా ఉండటం వల్ల కేలరీలు నియంత్రణలో ఉంటాయి. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు మష్రూం తినవచ్చంటున్నారు వైద్యులు.
మష్రూంలో పాలీ శాకరైడ్స్ కారణంగా యాంటీ డయాబెటిక్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. మధుమేహానికి వ్యతిరేకంగా రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది మధుమేహం రోగులకు చాలా ఉపయోగకరం. బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మష్రూం ఎప్పుడూ మితంగా తీసుకోవాలి. ఇలా చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు డయాబెటిస్‌ను పెంచుతుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. మష్రూంలు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి.
మష్రూంలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, మినరల్స్ ఉంటాయి. వీటికితోడు విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, టర్పెన్, క్వినోలోన్, స్టెరాయిడ్, ఫ్లెవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
Also read: Healthy Fruits: బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పకుండా తీసుకోవల్సిన 5 ఫ్రూట్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook