Food for Daibetes patients: బ్లడ్ షుగర్ లెవల్స్ (Blood Sugar) అకస్మాత్తుగా పడిపోవడం ప్రమాదకరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను ఎప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలి. సమయానికి తినడం, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. తలనొప్పి, తల తిరగడం, నిద్ర లేమి.. ఈ లక్షణాలు బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోవడాన్ని సూచిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే... బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయినప్పుడు ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పండ్ల రసం త్రాగాలి


యాపిల్, నారింజ, పైనాపిల్ పండ్ల రసాలను తాగవచ్చు. జ్యూస్ తాగిన తర్వాత మీ రక్తంలో షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకోండి. అయితే జ్యూస్ ఎక్కువగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి. షుగర్ లెవల్స్ (టైప్ 2 డయాబెటిస్)ని ఎప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలి. దాని తగ్గుదలని ఎప్పటికప్పుడు గమనిస్తూ క్రమంగా పెంచడానికి ప్రయత్నించండి.


తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి 


రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోకుండా ఉండటానికి తాజా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. అరటిపండు, ద్రాక్షపండు, యాపిల్, దానిమ్మ వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పండ్లను తినండి. డ్రై ఫ్రూట్స్‌లో ఎండుద్రాక్ష తినవచ్చు. ఇది రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది. 


గ్లూకోజ్ మాత్రలు


బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే గ్లూకోజ్ మాత్రలు తీసుకోవచ్చు. ఎంత మోతాదులో తీసుకోవాలనేది గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి 15 నుండి 20 గ్రాములు సరిపోతుంది. భోజనం తర్వాత 10-20 నిమిషాలు వేచి ఉండండి. ఆ తర్వాత మీ షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకోండి. 


కొలెస్ట్రాల్ లేని పాలు..


ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచవచ్చు. దీని కోసం, కొవ్వు లేని పాలను తీసుకోవాలి. పాలలో విటమిన్ డి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది.


మిఠాయిలు తినండి


గమ్మీ క్యాండీలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) ప్రభావితం చేస్తాయి. ఇవి వేగంగా రక్తప్రవాహంలోకి శోషించబడతాయి. తద్వారా రక్తంలో చక్కెరను సమతుల్యం చేయగలుగుతాయి. అయితే వీటిని తీసుకున్న 15 నిమిషాల తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకోండి.


(గమనిక: ఈ సూచనలను పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. జీ తెలుగు న్యూస్ ఈ సూచనలను ధృవీకరించలేదు.)


Also Read: Corona in Telangana: రాష్ట్రంలో 4 వేల దిగువన కరోనా కొత్త కేసులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook