Diabetes: ఉదయాన్నే షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయా..పెరగడానికి కారణాలు ఇవే..!!
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తర్వాత ప్రాణాలకే ముప్పుంటుందని వారు చెబుతున్నారు.
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తర్వాత ప్రాణాలకే ముప్పుంటుందని వారు చెబుతున్నారు. అందుకే డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉండడం వల్ల ముప్పు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో ఉదయాన్నే షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. ఇలా పెరగడానికి కారణలేంటో తెలుసుకుందాం.
ఉదయం పూట రక్తంలో షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతున్నాయి..?
రక్తంలో చక్కెర స్థాయి పెరగడం అనేది సాధారణ ప్రక్రియ. ఇది సాధారణంగా రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు క్రమంత తప్పకుండా పెరుగుతూ ఉంటాయి. అయితే ఉదయం పూట మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉదయాన్నే హార్మోన్లలో మార్పులు:
ఉదయాన్నే శరీరంలోని హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీనికి మధుమేహంతో సంబంధం లేదు. ఒకవేళా మధుమేహం ఉంటే..శరీరంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది.
ఇన్సులిన్ స్థాయిలు:
రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి లేదా తగ్గడానికి ఎంత శక్తి అవసరమో శరీరం నిర్ణయిస్తుంది. కావున చాలా మంది డయాబెటిక్ పేషెంట్లలో ఇన్సులిన్ స్థాయిలు పడిపోయి. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ నియంత్రించడం చాలా కష్టంగా మారింది. రాత్రిపూట ఎపినెఫ్రిన్, కార్టిసాల్, గ్లూకాగాన్ వంటి గ్రోత్ హార్మోన్లు ఇన్సులిన్ నిరోధించేందుకు ప్రయత్నిస్తాయి. కావున చక్కెర స్థాయి ఉదయం పెరుగుతుంది.
ఉదయం రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి కారణాలు:
1. ముందు రోజు రాత్రి శరీరంలో తగినంత ఇన్సులిన్ లేకపోవడం వల్ల
2. నిద్రపోయే ముందు హానికరమైన ఆహారం తీసుకున్నందున రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
3. డయాబెటిస్ మెడిసిన్ వాడకపోయినందున కూడా ఇలాంటి సమస్య వస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Health Benefits Of Cinnamon: దాల్చిన చెక్క వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
Also Read: Bitter Gourd Benefits: కాకరకాయను వీరు అస్సలు తినకూడదు..తింటే దుష్ప్రభావాలు తప్పవు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook