Diabetes Treatment: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలోనైతే మధుమేహం వ్యాధి బారిన పడేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఈ మధుమేహాన్ని నియంత్రించుకునేందుకు తప్పకుండా శరీరంలో రక్తంలోని చక్కెర పరిమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గడానికి తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించడానికి తప్పకుండా చిలగడదుంపలను ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ దుంపను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిలగడదుంప ప్రయోజనాలు:


బ్లడ్‌లోని షుగర్‌ను అదుపు ఉంచుతుంది:
చిలగడదుంపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి ఈ దుంప ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. స్వీట్ పొటాటోలో యాంటీ డయాబెటిక్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఉడకబెట్టి తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి.


బరువు తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి:
చిలగడదుంపంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి. కాబట్టి శరీర బరువు తగ్గాలనుకునేవారు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ దుంపలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.


జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి:
చలి కాలంలో చాలా మందిలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అయితే జీర్ణ క్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా చిలగడ దుంపలను ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం, అజీర్తి సమస్యను దూరం చేసేందుకు సహాయపడతాయి.


కళ్ళకు మేలు చేస్తుంది:
అనారోగ్య సమస్యల నుంచే ఉపశమనం కలిగించడమేకాకుండా కళ్ళకు కూడా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్లకు మేలు చేస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి