Weight Loss Diet: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బరువు తగ్గడానికి పలు రకాల క్రియలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కేలరీలను కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి క్రమంలో ఆహారంలో పలు రకాల నియమాలు, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే శరీరంలో కేలరీల పరిమాణం క్రమంగా తగ్గిపోతే.. బరువు సులభంగా నియంత్రణలో ఉంటుంది. అయితే దీని కోసం పాలియో డైట్, కీటో డైట్, తక్కువ కార్బ్ డైట్ వంటివి పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీర ఫిస్ట్‌గా ఉండడానికి ఫిస్ట్‌ డైట్ పాటించాల్సి ఉంటుంది. ఇది పాటించే క్రమంలో కొద్దిపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా ఈ డైట్‌లో మూడు పూటలుగా ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్స్‌ కూడా ఉండాలి.ఈ ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రతి వారం 400-900 గ్రాముల బరువు తగ్గొచ్చు.


ఫిస్ట్ డైట్‌లో ఈ విషయాలను మానుకోండి:


బ్యాలెన్స్ డైట్‌లో మీరు ఆహారం ఎల్లప్పుడూ పిడికిలితో మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్, చాక్లెట్, స్వీట్లు తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డైట్‌లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్స్‌ కోసం మాంసం, చేపలు, గుడ్లు ఆహారంలో తీసుకోవాలి.


ఫిస్ట్ డైట్‌లో వ్యాయామం తప్పనిసరిగా చేయాలా..?:


ఫిస్ట్ డైట్‌లో వ్యాయామం చేయడం అవసరం లేదు. శారీరకంగా చురుకుగా ఉండడానికి తప్పనిసరిగా వ్యాయామం చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల  బరువు క్రమంగా తగ్గుతారు. రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే.. ఒక నెలలో 3-4 కిలోల బరువు తగ్గుతారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?


Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook