Watermelon drinks : ఈ వేసవికాలంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చల్లగా, తీయగా తాగుతూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు, వంటి వాటికి దూరంగా ఉంటూ.. పండ్ల రసాలు తాగడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు పుచ్చకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది. పుచ్చకాయ లో చాలా వరకు నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి  ఒకవైపు బరువు పెరగం, మరోవైపు మన శరీరానికి కావాల్సిన నీరు కూడా.. పుచ్చకాయలో పుష్కలంగా దొరుకుతుంది. కానీ రోజు అదే పుచ్చకాయ జ్యూస్ తాగాలి అంటే బోర్ కొడుతుంది. మరి పుచ్చకాయ జ్యూస్ ని బోర్ కొట్టకుండా.. వెరైటీగా వేరే వాటితో కలుపుకొని జ్యూస్ చేసుకుని తాగడం ఎలానో ఒకసారి చూద్దాం..  


పైనాపిల్:


పుచ్చకాయ ముక్కల్లో కొంచెం పైనాపిల్ రసం, ఒక నిమ్మకాయ, ఐదు పుదీనాఆకులు, కొంచెం అల్లం వేసి మిక్సీ చేసి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి.. చల్లగా తాగుతూ ఉంటే.. ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది.


పుదీనా:


పుచ్చకాయ ముక్కల్లో 10 పుదీనా ఆకులు వేసి జ్యూస్ లాగా చేసుకుని తాగొచ్చు. పుదీనా పుచ్చకాయ జ్యూస్ ని మరింత టేస్టీగా చేస్తుంది.


బీట్ రూట్: 


పుచ్చకాయతో పాటు బీట్ రూట్ ని కూడా ముక్కలుగా చేసి, కొంచెం అల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసి తాగినా.. కొత్తగా బాగుంటుంది. పైగా బీట్ రూట్ కలర్ పుచ్చకాయ జ్యూస్ కలర్ ను.. మార్చడమే కాక ఫ్లేవర్ ని కూడా చాలా టేస్టీగా మారుస్తుంది. 


ఆపిల్:


పుచ్చకాయ, ఆపిల్ కలయిక చాలా బాగుంటుంది. అందులో నచ్చిన వాళ్ళు అల్లం, నిమ్మరసం కూడా వేసుకొని జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. 


ద్రాక్ష: 


ద్రాక్ష జ్యూస్ చాలా బాగుంటుంది. దానిని పుచ్చకాయతో కలిపి తాగినా కూడా ఇంకా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు దీంట్లో కొంచెం తేనెను.. లేదా అల్లం కూడా వేసుకొని తాగొచ్చు. 


ఇక పుచ్చకాయతో వేరే ఫ్రూట్ ని కలపడం నచ్చని వారు.. సింపుల్ గా నిమ్మరసాన్ని పిండుకొని తాగచ్చు. లేదా అల్లాన్ని పుచ్చకాయ మొక్కల్లో వేసి జ్యూస్ చేసినా.. కొత్త టేస్ట్ వస్తుంది. పుచ్చకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అది మన శరీరానికి, చర్మానికి, మూత్రపిండాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 


పుచ్చకాయ లో ఉండే క్యాల్షియం, పొటాషియం మూత్రపిండాలని ఆరోగ్యంగా మారుస్తాయి. పుచ్చకాయ లో ఉండే లైకోపీన్.. క్యాన్సర్ కి కారణం అయ్యే కణాలతో కూడా పోరాడుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న పుచ్చకాయని.. ఏదో ఒక విధంగా తాగితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.


Also read: Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter