Do Not Consume Alcohol For After Vaccination: కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు, వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభమైంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడంతో వైద్యశాఖాధికారులు వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి తొలి దశ టీకాలు ఇస్తున్నారు. అయితే మందుబాబులు అలర్ట్‌గా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. అయితే మద్యంప్రియులు ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. కోవిడ్-19 వ్యాక్సిన్(COVID-19 Vaccination) తీసుకోవడానికి ముందు ఎలాంటి మద్యం ముట్టరాదని చెబుతున్నారు. అదే విధంగా టీకా తీసుకున్న తరువాత సైతం వీరు మద్యం సేవించవద్దని హెచ్చరిస్తున్నారు.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..



కోవాగ్జిన్(Covaxin), కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న మందుబాబులు నెలన్నర రోజులకుపైగా మద్యం సేవించవద్దని సలహా ఇస్తున్నారు. మద్యం సేవించేవారిలో లింపోసైట్ కణాలు సగానికి సగం పడిపోతాయిని చెప్పారు.



లింపోసైట్ కణాలు తగ్గడంతో కరోనా వ్యాక్సిన్(CoronaVirus) ప్రభావం చాలామేరకు తగ్గుతుందని చెప్పారు. మరోవైపు మద్యం సేవించడం వల్ల రోగ నిరోధకవ్యవస్థ సైతం దెబ్బ తింటుందని మందుబాబులకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు.


Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?



తొలి దశ టీకా తీసుకున్నవారికి 28 రోజుల తరువాత రెండో దఫాలోనూ అదే కంపెనీ టీకా ఇస్తారు. దాని ప్రభావం తగ్గకుండ ఉండాలంటే కరోనా టీకా తీసుకున్న రోజు నుంచి కనీసం నెలన్నరపాటు మద్యం ముట్టరాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మరికొందరు కనీసం నెల రోజులపాటు మద్యం సేవించవద్దని  చెబుతున్నారు.


Also Read: Health Benefits Of Pranayama: ప్రతిరోజూ ప్రాణాయామం చేస్తే ఇన్ని ప్రయోజనాలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook