Oral Health: మీ నాలుకలో వచ్చే మార్పు.. ఆరోగ్యం అంచనా వేయవచ్చు అని మీకు తెలుసా?
Oral health: చెక్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు జనరల్ గా పాటు నాలుకను కూడా చెక్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారో మనలో చాలామందికి తెలియదు. మన నాలిక మన శరీరంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఒక మిర్రర్ లా పనిచేస్తుంది. అందుకే డాక్టర్లు మొదట మన నాలికను చూపించమని అడుగుతారు. అయితే నాలిక మన ఆరోగ్యం గురించి ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? తెలుసుకుందాం..
Tongue health: రోజు పొద్దున నిద్రలేచి మొదట బ్రష్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైన పని. చాలామంది ఇదేదో మొక్కుబడిగా రెండు నిమిషాల్లో పళ్ళు తోముకోవడం పూర్తి చేస్తారు .కానీ ఇలా చేయడం వల్ల మన ఓరల్ హెల్త్ దెబ్బ తినడమే కాకుండా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మన నాలిక మన శరీరంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడంలో సహాయపడుతుంది. కాబట్టి మన నాలికను జాగ్రత్తగా క్లీన్ చేయడం మన బాధ్యత.
నాలికపై వచ్చే మార్పుల ఆధారంగా డాక్టర్లు సులభంగా మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయగలరు. నాలిక రంగులో,పరిమాణంలో వచ్చిన మార్పు శరీరంలో అనారోగ్యానికి సూచన అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. అయితే నాలుకలో కనిపించే మార్పులను ఆధారంగా డాక్టర్లు మన శరీర ఆరోగ్య పరిస్థితిని ఎలా నిర్ధారిస్తారో తెలుసుకుందాం.
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుక గులాబీ రంగులో ఉంటుంది. ఇది కొందరిలో లేత గులాబీ రంగులో ఉంటే మరికొందరిలో ముదురు గులాబీ రంగులో ఉంటుంది. దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అయితే మన నాలికపై తెల్లని మచ్చలు కనిపిస్తే మాత్రం అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు సంకేతం. సరైన చికిత్స ద్వారా ఇది తగ్గించుకోవచ్చు. అయితే నల్లగా కనిపిస్తే జాగ్రత్త పడాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
మన గొంతులో బ్యాక్టీరియా, ఫంగస్ వంటిది ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు నాలిక నలుపు రంగులోకి మారుతుంది. కొన్ని సందర్భాలలో ఇలా నలుపు రంగులోకి మారిన నాలిక క్యాన్సర్‌కు కూడా సూచనగా భావిస్తారు. అదే నాలిక పచ్చటి పసుపు రంగులో ఉంటే ఆ వ్యక్తికి కామెర్లు ఉన్నాయి అని సూచన. అయితే కొన్ని సందర్భాలలో డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇలా నాలిక పసుపు రంగులోకి మారుతుంది. నాలిక నీలిరంగులో కనిపిస్తే అది గుండె సంబంధిత సమస్యకు సూచన. కాబట్టి వెంటనే అలర్ట్ అవ్వడమే కాకుండా డాక్టర్ ను సంప్రదించాలి.
గమనిక: పైన ఇవ్వబడిన సమాచారం నిపుణుల సూచన మేరకు సేకరించడం జరిగింది ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి