Sanitizer on Face Mask: ఫేస్‌మాస్క్‌పై శానిటైజర్ స్ప్రే చేస్తున్నారా? అయితే జాగ్రత్త!
Sanitizer on Face Mask: ప్రస్తుతం ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మరి ఫేస్‌మాస్క్‌పై శానిటైజర్ స్ప్రే చేస్తే అవి మరింత సమర్థంగా పని చేస్తాయా? నిపుణులు ఏమంటున్నారు?
Sanitizer on Face Mask: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఉద్ధృతి కాస్త తగ్గింది అనుకునేలోపే రూపు మార్చుకుని.. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ఈ కోవలోకే వస్తాయి.
ఇక కరోనా మహమ్మారి భయాల కారణంగా గత రెండేళ్లుగా ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. కరోనా సోకకుండా తమను తాము కాపాడుకునేందుకు ఫేస్ మాస్క్‌లు కచ్చితంగా వాడాల్సిన అవసరం ఏర్పడింది.
మార్కెట్లో రకరకాల ఫేస్ మాస్క్‌లు..
కొవిడ్ కాలంలో మాస్కులు కూడా వివిధ రకాలుగా అందుబాటులోకి వచ్చాయి. మూడు లేయర్ల ఫేస్ మాస్క్, ఎన్ 95 సహా బట్టతో తయారు చేసిన రీ యూజబుల్ ఫేస్ మాస్క్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
కొవిడ్ నుంచి రక్షణ కోసం చాలా మంది శానిటైజర్ కూడా వాడుతున్నారు. పరిసరాలను కూడా శుభ్రం చేసేందుకు శానిటైజర్లు స్ప్రేలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొంత మంది తాము వాడే మాస్కులు మరింత సమర్థంగా పని చేస్తాయనే ఉద్దేశంతో వాటిపై కూడా శానిటైజర్ స్ప్రే కొడుతున్నారు. మరి ఇలా చేయడం ఎంత వరకు శ్రేయస్కరం? మాస్కులపై శానిటైజర్ స్ప్రే కొట్టడం వల్ల నిజంగానే.. సమర్థంగా పని దాని పనితీరు మెరుగవుతుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు చూద్దాం.
ఫేస్ మాస్క్‌పై శానిటైజర్ స్ప్రే చేయొచ్చా?
ఫేస్ మాస్క్‌లు మరింత సమర్థంగా పని చేస్తాయని ఉద్దేశంతో వాటిపై శానిటైజర్ స్ప్రే చేయడం అంత కరెక్ట్ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సర్జికల్ ఫేస్ మాస్క్‌లపై శానిటైజర్ స్ప్రే చేయడం వాటికి కరోనా సహా వైరస్‌లను అడ్డుకునే సామరథ్యం తగ్గుతుందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సర్జికల్ ఫేస్ మాస్క్‌లో.. ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఛార్జ్ వైరస్‌లను ఆకర్షించి వాటిని ట్రాప్ చేస్తుందని వివరించారు. కానీ శానిటైజర్ ఫేస్ మాస్క్‌లపై స్ప్రే చేయడంతో అందులో ఉండే ఆల్కహాల్ కారణంగా.. ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ దెబ్బతింటుందని.. దీనితో ఆ మాస్కులను ధరించినా పెద్దగా ఉపయోగముందడను స్పష్టం చేశారు. అందుకే సర్జికల్ ఫేస్ మాస్క్‌లను అయితే దానికి ఇచ్చిన పరిమిత సమయానికి మార్చాలని చెబుతున్నారు. ఇక బట్టతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లు అయితే రోజుకు కనీసం ఒకసారి ఉతికి వినియోగించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతే కానీ వాటిపై శానిటైజర్‌ను స్ప్రే చేసి ధరించొద్దని సూచిస్తున్నారు
Also read: Buttermilk Health Benefits: లంచ్‌లో మజ్జిగ ఎందుకు తప్పనిసరి
Also read: Green Tea: డయాబెటిస్, ఒబెసిటీకు అద్భుతమైన ఔషధం గ్రీన్ టీ, ఎవరు తీసుకోకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook