జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం వికటిస్తుంటుంది. ఆరోగ్యాన్ని ఎప్పటికీ సంరక్షించుకోవాలంటే..కొన్ని సులభమైన అలవాట్లు చేసుకుంటే చాలంటున్నారు వైద్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిరోజూ ఉదయం పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ అలవాటును రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. శరీరానికి నీరు చాలా అవసరం. ఎందుకంటే శరీరంలో 70 శాతం నీరే ఉంది. సరైన మోతాదులో నీళ్లు తాగకపోతే.. శరీరం సరిగా పనిచేయదు. అందుకే రోజు ప్రారంభాన్ని గ్లాసు నీళ్లతో ప్రారంభించాలి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం వల్ల చాలా లాభాలున్నాయి. రోజూ పరగడుపున నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమున్నాయో చూద్దాం..


బరువు తగ్గించడంలో ఉపయోగం


ఉదయం పరగడుపున నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ప్రతిరోజూ ఉదయం వేళ పరగడుపున నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఫలితంగా రక్తం శుభ్రమౌతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.


కిడ్నీ రాళ్లు ముప్పును తగ్గిస్తుంది


ఉదయం లేచిన వెంటనే పరగడుపున నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పోతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యను తొలగించేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగుతుండాలి. యూరిన్ ఇన్‌ఫెక్షన్ వంటివి పూర్తిగా తొలగిపోతాయి.


చర్మానికి నిగారింపు


మీ చర్మానికి నిగారింపు రావాలన్నా.ఈ ఆలవాటే మంచి ప్రత్యామ్నాయం. రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగడమే కాకుండా..ఉదయం పరగడుపున నీళ్లు తాగుతుంటే చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. నీళ్లు తాగడం వల్ల స్కిన్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ముఖంపై ముడతలు పోతాయి.


Also read: Cholesterol Precautions: కొలెస్ట్రాల్ సమస్యను కేవలం నెలరోజుల్లో మాయం చేసే 4 ఆయుర్వేద చిట్కాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook