బీర్ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందా..?

బీర్.. ఓ మద్యపానీయం. ఎలాంటి మద్యపానీయమైనా మనకు ఆరోగ్యానికి చేటు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయినా అప్పుడప్పుడు బీరు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఆస్ట్రియాలోని గ్రాజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు ఈ విషయానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.కొందరు మగాళ్లలలో బీరు సేవించడం వలన సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతోందని, మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందని ఒక సర్వే ఆధారంగా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.అదే ఆడవారికి సంబంధించి మెదడు సామర్థ్యమును, దాని చురుకుదానాన్ని విశ్లేషించే పరీక్షలు చేసినప్పుడు, మూమూలు మహిళల కన్నా, 350 ఎంఎల్ బీరు తాగిన ఆడవాళ్లలో ఆ శాతం 40% ఎక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.