Drinking Tea Empty Stomach: ఉదయం టీలు కాఫీలు తాగుతున్నారా? అయితే తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..
Drinking Tea Empty Stomach: ప్రతిరోజు ఉదయం పూట టీలు, కాఫీలు తాగేవారు తప్పకుండా ఈ క్రింది సూచనలు అనుసరించాలి. లేకపోతే ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి సూచనలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Drinking Tea Empty Stomach: ప్రస్తుతం చాలామంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే కప్పు టీ లేదా కాఫీని తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం మంచిదేనా? ఉదయం ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రతిరోజు ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల అందులో ఉన్న కెఫిన్ శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఉదయం పూట ప్రతిరోజు కాఫీ తీసుకోవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే నీళ్లు తాగండి:
ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ గడుపుతూ కాఫీ తాగేవారు దానికి బదులుగా నీటిని తాగాను ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండడమే కాకుండా శరీరంలో నుంచి టాక్సిన్స్ తొలగిపోతాయి. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీటిని తాగిన తర్వాత కాఫీని తాగొచ్చు..
షుగర్ లెస్ కాఫీ:
ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగాలనుకునేవారు..కృత్రిమ స్వీటెనర్ ను వినియోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీలైతే ఉదయం పూట షుగర్ లెస్ కాఫీ తాగడం మంచిదని పరిశోధనల్లో తేలింది. ఎక్కువ చక్కెర పరిమాణాలు ఉన్న కాఫీ ని తాగడం వల్ల మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చక్కెర తీసుకోవడం నియంత్రించండి:
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం..మహిళలు రోజుకు ఆరు టీస్పూన్ల చక్కెర మాత్రమే తీసుకోవాలని అధ్యయనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా షుగర్ ఫ్రీ కలిగిన కాఫీ టీ లను తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అయితే ప్రతిరోజు కాఫీని ఎక్కువగా తాగేవారు చక్కెర వినియోగించకుండా తాగడం మంచిది.
దాల్చిన చెక్క టీ:
ప్రతిరోజు ఉదయం టీ తాగాలనుకునేవారు, దానిని తయారు చేసే క్రమంలో దాల్చిన చెక్క, ఇతర మసాలా దినుసులను వినియోగించి తయారుచేసిన టీని తాగడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీలైతే ప్రతి రోజు టీలో దాల్చిన చెక్క, పసుపు, జాజికాయ, లవంగాలు పొడిని మిక్స్ చేసుకొని తాగడం మంచిదని వారంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.