Drinking Water after Eating Jamun Fruit: కొన్ని రకాల ఆహార పదార్థాలు, పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందులో అల్ల నేరేడు పండ్లు కూడా ఒకటి. అల్ల నేరేడు పండ్లలో ప్రోటీన్, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్, పాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సీ, బీ6 పుష్కలంగా ఉంటాయి. అయితే నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేరేడు పండ్లు తిని నీళ్లు తాగవచ్చా.. :


నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆరోగ్యం పాడవుతుందని కొందరు చెబితే.. అలా ఏమీ ఉండదని మరికొందరు చెబుతుంటారు. కానీ వాస్తవానికి నేరేడు పండ్లు తిన్న వెంటనే 
నీళ్లు తాగితే ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే డయేరియా, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.


నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు :


బరువు తగ్గాలనుకునేవారు నేరేడు పండ్లు తీసుకుంటే మంచిది. నేరేడు పండ్లు జీర్ణక్రియను ఉత్తేజితం చేయడంతోపాటు బరువు తగ్గడంలో దోహదపడుతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరమనే చెప్పాలి. నేరేడు పండ్లు తినడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో దొరికే నేరేడు పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.



Also Read: Pavitra Lokesh: వెంట పడి వేధిస్తున్నారు.. ఆ ఇద్దరిపై పవిత్ర లోకేష్ ఫిర్యాదు


Also read:Rain Alert: అల్పపీడనం ముంచుకొస్తోందా..లెటెస్ట్ వెదర్‌ రిపోర్ట్ ఏం చెబుతోంది..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook