Detox Lungs: శీతాకాలం ఊపిరితిత్తులను నిర్విషీకరణ తప్పకుండా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!
Drinks for Lungs: చలి కాలంలో వాతావరణంలోని తేమ పరిమాణాలు పెరిగి అనేక రకాల ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించాలి.
Drinks for Lungs: శీతాకాలం ప్రారంభమైప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు తీవ్ర పెరిగిపోయింది. దీంతో పాటు వాతావరణ కాలుష్యం కూడా రెట్టింపు అయ్యింది. ఇలాంటి సమయంలోనే గాలిలో అనేక రకాల చెడు వాయువులు కలుస్తాయి. దీని కారణంగా చాలా మందిలో కంటి మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి సమస్యల వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఊపిరితిత్తులు పెరిగి..శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి తీసుకునే ఆహారాల్లో మార్పులు చేయడమే కాకుండా ఊపిరితిత్తులను నిర్విషీకరణ చేసే కొన్ని డ్రింక్స్ ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రింక్స్ ఏంటో..ఎప్పుడు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పసుపు పాలు:
పసుపు పాలలో రోగనిరోధక శక్తిని పెంచే అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తులలో మంటను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుంగా కూడా ఈ పసుపు పాలు శరీరాన్ని కాపాడుతాయి.
బీట్రూట్ రసం:
రక్తహీనత, ఐరన్ లోపం వంటి సమస్యలతో బాధపడేవారికి బీట్రూట్ రసం ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు పోషకాలు ఊపిరితిత్తులను మెరుగుపరించేందుకు కూడా సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
గ్రీన్ టీ:
బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీలు తీసుకుంటూ ఉంటారు. ఇందులో క్యాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ టీలను ప్రతి రోజు తాగడం వల్ల ఊపిరితిత్తులు నిర్విషీకరణ అవుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గ్రీన్ టీలను తీసుకోవాల్సి ఉంటుంది.
గోరు వెచ్చని నిమ్మనీరు:
నిమ్మకాయలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook