Drumsticks 6 Benefits: మునగాకు ప్రయోజనాలు ఎన్ని ఉంటాయంటే అవి తెలిస్తే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు. ఎక్కడైనా కన్పిస్తే వెంటనే తీసుకొచ్చి తింటారు. ఎందుకంటే ఆరోగ్యపరంగా అంత అద్భుతమైంది. మునగాకుతో గుండె వ్యాధులు, లివర్ వ్యాధులు, మధుమేహం అన్నీ నయం చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునగ దక్షిణాదిలో విస్తృతంగా లభిస్తుంది. దీనినే ఇంగ్లీషులో డ్రమ్‌స్టిక్ అంటారు. ఇది నిజంగా మహత్తు కలిగింది. ఆయుర్వేదంలో మునగ ఉపయోగం అనాదిగా వస్తున్నదే. మునగ పూలు, విత్తనం, మునగ కాయ అన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అన్నింటికంటే ఎక్కువ పోషకాలు మునగాకుల్లో ఉంటాయి. మునగాకులో విటమని ఎ, విటమిన్ సి, విటమిన్ ఇతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఔషధ గుణాల ఖజానా ఇది. ఇందులో క్వెర్‌సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే మునగాకు తీసుకోవడం వల్ల  6 రకాల వ్యాధుల్నించి తక్షణ ఉపశమనం పొందవచ్చు. 


మలబద్ధకం సమస్యకు మునగాకు అద్భుతంగా పరిష్కారం చూపిస్తుంది. ఇందులో ఉండే పైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా మునగాకులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల జీర్ణ సంబంధ ఇతర సమస్యలు తొలగిపోతాయి. స్థూలకాయం సమస్యకు కూడా మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ల కారణంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. అందులో ఉండే క్లోరోఫల్ బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది.


ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం కల్గిస్తుంది. మునగాకు తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గించవచ్చు. ఇందులో ఉండే పోషకాలతో స్వెల్లింగ్ తగ్గుతుంది. లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడవచ్చు. బ్లడ్ ప్రెషర్ నియంత్రించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్వెర్‌సెట్టిన్ రక్తపోటును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం కారణంగా ధమనుల్లో రక్త సరఫరా మెరుగుపడుతుంది.


కొలెస్ట్రాల్ సమస్య సైతం మునగాకుతో అద్బుతంగా అదుపులోకి వస్తుంది. ఇందులో ఉండే పైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బ్లాకేజ్ కారణంగా తలెత్తే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ సమస్యలు తగ్గుతాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది డయాబెటిస్. మునగాకు మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇన్సులిన్‌లా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా బ్లడ్ షుగర్ అనేది నెమ్మదిగా సంగ్రహణ అవుతుంది. 


Also read: 7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook