Dry Fruits vs Eggs: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఉదయం అల్పాహారంలో భాగంగా అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట తీసుకునే ఆహారాలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కొంతమంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాలు అధిక మోతాదులో ఉండే గుడ్లను, డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి వీటి రెండింటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. వీటి రెండిట్లోనూ శరీరానికి అవసరమయ్యే పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. కానీ వీటి రెండిట్లోనూ ఒక దాన్ని ఎంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో గుడ్ల కంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి వీటి రెండిట్లో ఏది అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి చాలా మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


డ్రై ఫ్రూట్స్ vs గుడ్లు:
బాదం, వాల్‌నట్స్ , పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


డ్రై ఫ్రూట్స్ తో పోల్చి చూస్తే గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు (A, D, B12), ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కండరాలు కూడా దృఢంగా మారుతాయి. అంతేకాకుండా శరీరం యాక్టివ్ గా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది మదిలో డ్రై ఫ్రూట్స్, గుడ్లపై అనేక ప్రశ్నలు తలెత్తవచ్చు. అయితే వీటి రెండింటిలో వేటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువగా ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం..


ఏది మంచిది?
BMC మెడిసిన్ జర్నల్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా గుడ్ల కంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని కనుగొన్నారు. అంతేకాకుండా గుడ్లలో ఉండే గుణాలు కొందరికి అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రతిరోజు అల్పాహారం లో భాగంగా 25 గ్రాముల డ్రైఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  


గింజలు ఎందుకు మంచివి?:
గుడ్లతో పోలిస్తే గింజల్లో ఎక్కువగా డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా డ్రై ఫ్రూట్స్ ఎంతో ప్రభావవంతంగా సహాయపడతాయి. కాబట్టి సీజనల్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి