Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
Health Tips | జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు (Weight Loss Tips) పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Weight Loss Tips In Telugu | గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. అయితే ప్రస్తుతం విద్యా్ర్థులు ఇంటి వద్ద ఉంటున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ (Work From Home) చేస్తున్నారు. ఈ కారణాలతో వీరికి ఊబకాయం (పొట్ట) వచ్చే అవకాశాలు అధికం, లేక ఇదివరకే బొజ్జ ఉన్నవారికి అది భారీగా పెరగవచ్చు. కానీ ఇది మంచి లక్షణం కాదని, కరోనా సమయంలో ఇది మెదడుపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు, నిపుణులు చేసిన సర్వేలో తేలింది. Also Read: ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..
Health Tips | ఊబకాయం అధికమయ్యే కొద్దీ ఆలోచన శక్తి మందగిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో తెల్ల రక్తకణాలు అతిగా స్పందించి మెదడులోని రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు (Weight Loss Tips) పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
బరువు తగ్గేందుకు చిట్కాలు... (Weight Loss Tips In Telugu)
- మంచినీళ్లు అధికంగా తాగాలి. తినడానికి అరగంట ముందు నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. దాని ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
- ఉదయం తినే అల్పాహారం మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ కాస్త అధికంగా తింటే అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారని (Weight Loss) వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మొదటికే మోసం వస్తుందట. రాత్రివేళ కాస్త తక్కువగా తినడంతో పాటు త్వరగా తినాలి.
- భోజనం తిన్న వెంటనే చిరుతిళ్లు అసలు తినకూడదు. ఇంట్లో చేసిన వంటలైనా సరే కాస్త గ్యాప్ ఇచ్చి తినడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
- వ్యాయామం (Gym, Excercise), ఎరోబిక్స్ లాంటివి చేస్తే బరువు (How To Weight Loss At Home) తగ్గవచ్చు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం మీ సొంతం.
- కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మంచింది. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటే అధిక బరువు సమస్య దరిచేరదు.
- మధ్యాహ్నం భోజనంతో పాటు ఉడకబెట్టిన బంగాళ దుంపలు తీసుకోవాలి. దీంతో అధికంగా తీసుకునే ఆహారాన్ని మనకు తెలియకుండానే నియంత్రించుకుంటాం.
- వర్క్ ఫ్రమ్ చేసినా ఇంటి పనులు చేసేందుకైనా మధ్యమధ్యలో కొన్నిసార్లు లేవాలి. దీనివల్ల సుదీర్ఘంగా కూర్చునే సమస్య తగ్గుతుంది. శరీరానికి కాస్త శ్రమ ఇవ్వడంతో కేలరీలకు కేలరీలు కరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- రాత్రి ఆలస్యంగా నిద్రించే చిన్నారులలో బరువు పెరిగే అవకాశం 89 శాతం ఉండగా, పెద్దవారిలో అయితే 55 శాతం మందిలో స్థూలకాయం (Obesity) బారిన పడే అవకాశం ఉంది. త్వరగా నిద్రించడం వల్ల పెరిగే బరువుకు చెక్ పెట్టేద్దామా. (Health Tips) అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి