Easy Weight Loss Tips: జిమ్, వాకింగ్‌కి వెళ్లకుండా కూడా 15 రోజుల్లో స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించవచ్చు!
Easy Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా ఎక్కువగా బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించండి.
Easy Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో గంటల పాటు జిమ్ముల్లో శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది ప్రస్తుతం స్లిమ్‌గా, ట్రిమ్‌గా కనిపించేందుకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన డ్రింక్స్ కూడా తీసుకున్నారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గినప్పటికీ కొంతమంది తీవ్ర దుష్ప్రభావాల బారీన పడుతున్నారు. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి తప్పకుండా కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి జీర్ణక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే శరీరంలోని అన్ని అవయవాల వ్యవస్థ సక్రమంగా సాగడానికి జీర్ణక్రియ కూడా సహాయపడుతుంది. శరీర బరువు తగ్గడానికి ముందుగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు ప్రోటీన్స్, ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
సులభంగా బరువు తగ్గడానికి తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఫైబర్ పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది తప్పకుండా పాటించండి:
ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు వేయించిన ఆహారాలు కూడా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాల్చిన, వేయించిన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే ఛాన్స్‌లు ఉండడమే కాకుండా జీర్ణక్రియ దెబ్బతినే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే క్రమంలో కొవ్వు తక్కువ పరిమాణంలో ఉండే పాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
సోమరితనంగా ఉండడం మానుకోండి:
ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని ఉంటారు. దీని కారణంగా కూడా కొందరిలో ఊబకాయం సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి సిరీయస్‌గా బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు గంటకు 15 నుంచి 20 నిమిషాల పాటు నవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడానికి శరీరక శ్రమ చేసేవారు పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి