Wheat Chickpea Benefits in Summer: వేసవిలో ఈ పిండితో చేసిన రోటీలను తినండి, శరీరానికి మంచి లాభాన్ని ఇస్తుంది..!
Rotis Made From These Flours: ప్రతి ఒక్కరు చలికాలంలో శరీరానికి వేడిని ప్రభావితం చేసే ఆహారాన్ని తీసుకుంటారు. అదే విధంగా వేసవిలో కూడా శరీరాన్ని వేడి నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. సమ్మర్‌లో చాలా మంది శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఐస్ క్రీం, శీతల పానీయాలు తీసుకుంటారు
Rotis Made From These Flours: ప్రతి ఒక్కరు చలికాలంలో శరీరానికి వేడిని ప్రభావితం చేసే ఆహారాన్ని తీసుకుంటారు. అదే విధంగా వేసవిలో కూడా శరీరాన్ని వేడి నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. సమ్మర్‌లో చాలా మంది శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఐస్ క్రీం, శీతల పానీయాలు తీసుకుంటారు. అంతే కాకుండా వేసవిలో కూడా శరీరాన్ని వేడి నుంచి రక్షించుకునేందుకు రోటిలను కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మందికి వేసవిలో రొట్టే శరీరానికి మంచి పోషకాలను ఇస్తుందని తెలియదు. ఇది శరీరానికి మంచి విటవిన్లు అందిచడమే కాకుండా శరీర అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది మీ శరీరానికి చల్లదనాన్ని కూడా అందజేస్తుంది. అయితే వేసవిలో ఏ పిండితో చేసిన రోటీలు మనం తింటే చల్లదనాన్ని ఇస్తాయో తెలుసుకుందాం.
వేసవిలో ఈ పిండితో చేసిన రొట్టెలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి:
గోధుమ పిండి(Wheat Flour) :
ప్రస్తుతం చాలా మంది గోధుమలతో చేసిన రోటీలను తినేందుకు ఇష్టపడతారు. శీతాకాలంలో మిల్లెట్ మొక్కజొన్న, గోధుమతో చేసిన రోటీలను తినడం వల్ల శరీరంలో వేడిని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా వేసవి కాలంలో ఆహారంలో గోధుమ పిండితో చేసిన రోటీలను తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ శరీరానికి అంతర్గత చల్లదనాన్ని ఇస్తుందని అంటున్నారు.
శనగ పిండి(Chickpea Flour) :
వేసవిలో శనగపిండితో చేసిన రోటీలను కూడా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పిండితో తయారు చేసిన రోట్టెలను తినడం ద్వారా శరీరానికి మంచి లాభాలను ఇస్తుందని తెలుపుతున్నారు.
శనగపిండిలో ప్రొటీన్లు ఉన్నందున శరీర అభివృద్ధికి సహయపడతాయని అంటున్నారు. ఇది బరువును నియత్రించడంలో మంచి పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
బార్లీ పిండి (Barley Flour) :
ఎండాకాలంలో పొట్ట చల్లగా ఉండేందుకు బార్లీ పిండితో చేసిన జావాను తాగుతుంటారు. కావాలంటే బార్లీ పిండితో చేసిన రోటీలు కూడా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చుతుందని అభిప్రాయ పడుతున్నారు.
జొన్న పిండి (Sorghum Flour):
జొన్న పిండి(Sorghum Flour)లో ప్రొటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మినరల్స్ ఉండడం ద్వారా ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా ఇది మీ శరీరానికి చల్లధనాన్ని కూడా ఇస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Causes Of Stomach Pain In Women: తరచూ మీకు కడుపు నొప్పి వస్తుందా..అయితే కారణమేంటో తెలుసుకోండి
Also Read: Sri Lanka Crisis: శ్రీలంకలో దారుణం.. చివరి రోజుకు చేరుకున్న పెట్రోల్, డీజిల్ నిల్వలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.