Cucumber Benefits: శీతాకాలంలో దోసకాయలను ఉదయాన్నే తింటే శరీరానికి బోలెడు లాభాలు!
Cucumber Benefits: శీతాకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు కీర దోసకాయను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
Cucumber Benefits: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తేలికపాటి చలి మొదలైంది. నవంబర్ చివరి నెలలో చలి తీవ్ర పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో వాతావరణంలో తేమ తీవ్ర కూడా పెరుగుతుంది. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ శీతాకాలం సమయంలో తప్పకుండా జీవనశైలిలో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా జలుబు, ఫ్లూ బారిన పడతారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కీర దోసకాయను తీసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి:
చలికాలంలో మధుమేహం ఉన్నవారు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. చాలా మందిలో ఈ సమయంలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ..తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు దోసకాయను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని నీటి శాతాన్ని కూడా పెంచుతాయి.
బరువు తగ్గుతారు:
చలి కాలం వాతావరణం వేగంగా మారుతుంది. ఈ సమయంలో తేమ కూడా పెరుగుతుంది. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శీతాకాలంలో బరువు తగ్గడానికి ప్రతి రోజు దోసకాయలను ఆహారంలో తీసుకోవాలి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి:
జీర్ణ సమస్యలతో బాధపడేవారు శీతాకాలంలో తప్పకుండా పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఫైబర్ అధిక పరిమాణంలో లభించే దోసకాయలను ఉదయాన్ని తినాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు మలబద్ధకం సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె ఆరోగ్యం కోసం:
శీతాకాలంలో గుండె జబ్బులు పెరగడం సహజం..చాలా మంది గుండె వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ఇలాంటి కేసులో చలికాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం..అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు దోసకాయలను సలాడ్స్‌లో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా రక్తపోటు సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook