COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mokka Jonna Roti For Weight Loss: చలికాలంలో చాలా మందిలో ఆకలి పెరిగిపోతుంది. దీని కారణంగా విచ్చలవిడిగా ఆహారాలు తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు డైట్‌ పాటించడం కారణంగా ఏ ఆహారాలు పడితే ఆ ఆహారాలు తినలేకపోతారు. వెయిట్ లాస్‌ అవ్వాలనుకునేవారు శీతాకాలంలో రోటీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి రెట్టింపు లభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మొక్కజొన్నలో విటమిన్ ఎ, బి, ఇతో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, సెలీనియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ పిండితో తయారు చేసిన రోటీలను ప్రతి రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచి లాభాలు పొందుతారు. మొక్కజొన్నలో ఉండే గుణాలు రక్తపోటు నుంచి శరీర బరువు వరకు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మొక్కజొన్న రొట్టె తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


చలికాలంలో మొక్కజొన్న రోటీలను తినడం వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడం:

శీతాకాలంలో గోధుమ రోటీలకు బదులుగా మొక్కజొన్న రొట్టెలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోటీలను ప్రతి రోజు తీసుకుంటే శరీరంలో ఎనర్జీ మెయింటెయిన్ అవ్వడమే కాకుండా పొట్ట నిండుగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఇందులో ఉండే పీచు పదార్థాలు ఆకలిని నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.    


రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శీతాకాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అయితే మొక్కజొన్నతో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  మొక్కజొన్నలో ఉండే జింక్, విటమిన్లు శరీర అభివృద్ధికి కూడా సహాయపడతాయి. 


Also Read: Iqoo 12 Price: మొట్టమొదటిసారిగా కొత్త చిప్‌సెట్‌తో మార్కెట్లోకి iQOO 12 మొబైల్..ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇవే..


మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
చలి కాలంలో చాలా మందిలో శరీరక శ్రమ తగ్గుతుంది. దీని కారణంగా మధుమేహం ఉన్నవారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్‌ పరిమాణాలు ఇన్సులిన్ సమతుల్యతను రక్షించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


రక్తహీనత సమస్యలకు చెక్‌:
శీతాకాలంలో చాలా మంది స్త్రీలలో రక్తహీనత సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మొక్కజొన్న రొట్టెలను తీసుకోవడం వల్ల సులభంగా రక్తహీనత సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా రక్తంలోని ఎర్ర కణాల సంఖ్యను పెంచేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Iqoo 12 5G Price: iQOO 12 5G మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్‌..ఏకంగా రూ.41,750 తగ్గింపు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి