COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Health Benefits Of Eating Raisins During Pregnancy: గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తల్లితో పాటు బిడ్డకు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు గర్భిణీ స్త్రీలు ఎండుద్రాక్షను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి తగిన పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. దీంతో పాటు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఎండ్రు ద్రాక్షను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే లాభాలు:
రక్తహీనత సమస్యలకు చెక్‌:

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా చాలా మందిలో ఐరన్‌ లోపం సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా శరీరంలో రక్తహీనత, రక్త సరఫరాలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎండుద్రాక్ష తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లభించే ఐరన్‌ గర్భధారణ సమయంలో రక్తహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పుట్టబోయే బిడ్డను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


అలసట, బలహీనత:
గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా అలసిపోతూ ఉంటారు. దీంతో పాటు కొంతమంది శరీరం కూడా బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా మరికొంతరు నీరసంగా, సోమరితనంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎండు ద్రాక్ష ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో అధికంగా ప్రోటీన్స్‌ లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు సహాయపడుతుంది.


మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
గర్భధారణ సమయంలో స్త్రీలలో మలబద్ధకం సమస్యలు రావడం సర్వసాధరణం..కానీ కొంతమందిలో తరచుగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా తీవ్ర జీర్ణక్రియ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎండుద్రాక్షను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు సులభంగా మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook