Health Benefits Of Sweet Potatoes: చిలకడదుంపలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఎక్కువగా చలికాలంలో తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్‌ ఎ, సి, బి, డి పుష్కలంగా లభిస్తాయి. వీటిని ముడిగా తినవచ్చు, వేయించవచ్చు, పొడిగా చేసి వాడవచ్చు. వీటిని ఆయుర్వేద ఔషధాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 చిలకడదుంపల పోషకాహార విలువలు:


చిలకడదుంపలలో  పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మంచి కొవ్వులు, ఫైబర్, మినరల్స్‌ , విటమిన్లను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలను తొలగిస్తుంది. అలాగే కడుపు సమస్యలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. బరువు నియంత్రించడంలో కూడా ఈ దుంపలు సహాయపడుతాయి. చిలకడదుంపలలో ఆరోగ్యకరమైన కొవులు ఉంటాయి. అందులో ఒమేగా-3, ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో మేలు చేస్తుంది. 


ఈ చిలకడదుంపలో ఉండే పొటాషియం, ఫాస్పరస్‌, ఐరన్‌, మాంగనీస్‌ వంటి ఖనిజాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే తీవ్రమైన కీళ్ల నొప్పి, ఎముకల నొప్పితో ఇబ్బంది పడేవారు ఈ దుంపలను తీసుకోవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. మాంగనీస్ గాయం నయం చేయడానికి ఎంతో సహాయపడుతుంది.


రోగనిరోధక శక్తిని మెరుపరడంలో ఎంతో సహాయపడుతుంది ఈ చిలకడదుంపలు.  ఇందులో ఉండే  బి 12, సి, ఎ  కంటి చూపుకు , నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి మంచిది. డయాబెటిస్‌ ఉన్నవారు చిలకడదుంపలను తీసుకోవడం  వల్ల బోలెడు లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఇందులో ఉండే  ఫైబర్‌ షుగర్‌ లెవల్స్‌ను కొంట్రోల్‌ చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.  అంతేకాకుండా ఇవి క్యాన్సర్‌ కణాలను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాల పెరుగుదలున నిరోధించడంలో సహాయపడుతాయి. 


చిలకడదుంపలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు కూడా ఉంటాయి.  ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.


 చిలకడదుంపలను ఎలా తీసుకోవాలి:


చిలకడదుంపలను ముడిగా తినవచ్చు, వేయించవచ్చు. పొడిగా చేసి వాడవచ్చు. వీటిని సూప్‌లు, కూరలు, స్మూతీలు, ఇతర వంటకాలలో కలుపుకోవచ్చు. చిలకడదుంపల పొడిని పాలల్లో కలిపి తాగవచ్చు లేదా నీటిలో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌గా వాడవచ్చు. చిలకడదుంపలను సురక్షితం అయినప్పటికీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. గర్భిణీ స్త్రీలు  బాలికలు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే చిలకడదుంపలను తీసుకోవాలి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. 
 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి