Vitamin E Rich Foods For Skin: అందంగా కనిపించాలని మహిళలు, పురుషులు ఎన్నో రకాల ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తారు. దీని కోసం కొందరు క్రీమ్స్‌, ఆయిల్స్‌, సిరమ్స్‌ వాడుతారు. వీటి వల్ల ఫలితం ఉంటుంది కానీ అది కొంత వరకు పనిచేస్తుంది. మన శరీరం లోపలి నుంచి క్లీన్‌గా ఉంటే ఔటర్ గ్లో కనిపిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మనం విటమిన్‌ ఇ లభించే ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. మీరు ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాల్లో విటమిన్‌ ఇ ఉండేలా చూసుకోవాలి.  దీని తీసుకోవడం వల్ల చర్మం సహజంగా అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్‌ ఇ లభించే పదార్థాలు: 


వేరుశెనగలు:


వేరుశెనగ గింజల తీసుకోవడం వల్ల చర్మం పై మెరుపును తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్‌ ఇ లభిస్తుంది. ఇది చర్మానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 


అవకాడో:


ప్రతిరోజు మీ డైట్‌ లో అవకాడో తీసుకోవడం వల్ల చర్మం, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ ఇ, ఏ, సీ లభిస్తాయి. ఈ విటమిన్స్‌ మీ శరీరానికి బాగా పనిచేస్తాయి. అవకాడో తీసుకోవడం వల్ల స్కిన్‌ గ్లోయింగ్‌ అవుతుంది. 


బాదం:


బాదం పప్పు తీసుకోవడం వల్ల విటమిన్‌ ఇ పుష్కలంగా లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల ఇతర పోషకాలు అయిన ప్రోటీన్‌, ఫైబర్‌, పొటాషియం లభిస్తాయి. 


బ్రోకలీ:


చర్మం మెరుపును తీసుకురావడానికి బ్రకోలీ ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుంతుంది. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు మరియు ప్రయోజనకరమైన పోషకాలను కలిగి ఉంటుంది. దీని ఎక్కువగా  తీసుకోవడం వల్ల స్త్రీల యోనిలో  ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది.


పొద్దుతిరుగుడు: 


పొద్దుతిరుగుడు గింజలలో అనేక ప్రయోజనకరమైన పదార్థాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ కూడా లభిస్తుంది. ఇది చర్మం లోపల నుంచి కాంతిని తెస్తుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంతో పాటు శరీరం కూడా బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter