Egg Side Effects: సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మారవచ్చు. రోజూ తినే ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తే శరీరంలో అనేక దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాల కలయిక వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల అలసట, వికారం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పైన పేర్కొన్న కొన్ని ఆహార పదార్థాల కలయికలో ముఖ్యంగా కోడిగుడ్డు గురించి చెప్పుకోవాలి. కోడిగుడ్డులో చాలా పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే గుడ్లు తక్కువ కార్బ్ ఆహారంగా పరిగణించబడతాయి. కోడిగుడ్లను అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. మనం దానిని అనేక రూపాల్లో తింటాము. అయితే గుడ్డు తిన్న తర్వాత ఈ 4 ఆహారాలను ఎప్పుడూ తినకూడదు.


1) పనీర్


మనలో చాలా మంది పనీర్, గుడ్లను కలిపి లేదా మిక్స్ చేసి స్పెషల్ రెసిపిని తయారు చేసి తింటుంటారు. అయితే పనీర్, గుడ్డు.. రెండూ కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ వల్ల మలబద్ధకాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటివి కలుగుతాయి.


2) నిమ్మకాయలు


గుడ్డు రుచిని పెంచడానికి ప్రజలు నిమ్మకాయలను తింటారు. దీంతో పాటు కోడిగుడ్డుతో చేసిన వంటకాల్లో నిమ్మరసాన్ని కూడా వాడుతుంటారు. అయితే గుడ్డు, నిమ్మకాయ కలిసి ప్రతిచర్య ఉంటుంది. దీని వల్ల శరీరంలో దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 


3) అరటి పండ్లు


అల్పాహరంలో భాగంగా గుడ్డు తిన్న వెంటనే అందరూ అరటిపండ్లు తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ మన కడుపులో జీవక్రియను నెమ్మదిస్తాయి. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్, ప్రేగు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అలాగే, బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది హానికరం.


4) చేపలు


చేపలు తిన్న తర్వాత గుడ్డు తినాలా? ప్రజలు తరచుగా ఈ ప్రశ్న అడుగుతారు. కానీ గుడ్లు, చేపలను కలిపి తినడం లేదా ఒకదాని తర్వాత ఒకటి తినడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇది ప్రోటీన్ అలెర్జీలకు కారణం కావచ్చు. కాబట్టి ఈ గుడ్డు, చేప కాంబినేషన్లను తినే ముందు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.


Also Read: Aloe Vera Juice Benefits: కలబంద జ్యూస్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో తెలుసా?


Also Read: Summer Foods: వేసవిలో ఈ 5 రకాల ఆహారాలను తింటే వేడి నుంచి ఉపశమనం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook