Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌కు ఇలా 15 రోజుల్లో గుడ్ బాయ్ చెప్పి.. గుండె పోటు సమస్యలకు చెక్ పెట్టండి..
Eggs And Cholesterol: చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Eggs And Cholesterol: ఉడకబెట్టిన గుడ్లలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషక విలువలు లభిస్తాయి. వీటి అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి ప్రోటిన్స్ అందడమేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. అయితే చాలా మంది గుండె సమస్యలతో బాధపడేవారు కోడి గుడ్లను తినకూడదనే సందేహంతో తినడం మానుకుంటున్నారు. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు కూడా గుడ్డును తీసుకోవడం లేదు. అయితే చాలా మందిలో గుడ్లను తినాలో వద్ద అనే ప్రశ్న కూడా తలెత్తుంది. అందరూ ఈ క్రమంలో గుడ్లను తినొచ్చు. అయితే వీటిని ఎలా తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుడ్డు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందా..?:
గుడ్లలో మానవ శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది శరీంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఖండరాల నిర్మాణానికి సహాయపడతాయి. ముఖ్యంగా వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు. కాబట్టి గుడ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ సమస్యలు సులభంగా దూరమవుతాయి. అయితే వీటిని రెట్టింపు ప్రయోజనాలు పొందాలనుకుంటే.. క్రమం తప్పకుండా ఆహారాల్లో ఈ గుడ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
రోజూ ఎన్ని గుడ్లను తీసుకోవాలో తెలుసా..?:
గుడ్డు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, గుండె జబ్బుల ఇతర అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి రోజుకు 2 గుడ్లు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గుడ్లను అతిగా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు:
ప్రస్తుతం చాలా మంది శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
వీటిని ఆహారంగా తీసుకోండి:
రెడ్ మీట్:
రెడ్ మీట్ శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిలో ప్రోటీన్‌ల పరిమాణం అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని వారానికి ఒక సారి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
ఫుల్ ఫ్యాట్ మిల్క్:
పాలు శరీర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వీటిని సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.
ఆయిల్ ఫుడ్స్:
ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల ఆయిల్ ఫుడ్స్‌ను విచ్చల విడిగా తీసుకుంటున్నారు. అయితే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చు. కాబట్టి అతిగా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook