గర్భిణీ స్త్రీలకు వైద్యులు ప్రత్యేక సూచనలు ఇస్తుంటారు. డైట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంటారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదనేది ప్రత్యేకంగా తెలుసుకోవల్సిన అవసరముంటుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే సండే హో యా మండే..రోజ్ ఖాయే అండే అనేది బాగా ప్రాచుర్యంలో ఉన్న నినాదం. కానీ గర్భిణీ మహిళలకు గుడ్లు ఎంతవరకూ మంచదనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ వివరాలు మనం పరిశీలిద్దాం.


గర్భధారణలో గుడ్లు తినవచ్చా లేదా


గర్భధారణ సమయంలో చాలా రకాల పదార్ధాలు తినకూడదని వైద్యులు చెబుతుంటారు. ఈ జాబితాలో పచ్చిది, సగం ఉడికిన ఆహారం ఉంటుంది. ఎందుకంటే హాఫ్ బాయిల్డ్ ఫుడ్‌లో బ్యాక్టీరియా ఉండే అవకాశాలున్నాయి. ఈ బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలకు, గర్భంలో శిశువుకు సమస్యలు సృష్టిస్తుంది. అందుకే గుడ్లు తినాలంటే హాఫ్ బాయిల్డ్ కాకుండా..పూర్తిగా వండిందే తినాలి.


గుడ్లు ఎలా తినాలి


గుడ్ల నుంచి సాల్మొనెల్లా బ్యాక్టీరియా వస్తుంది. గర్భిణీ మహిళలు గుడ్లతో చేసే మేయోనీస్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోకూడదు. వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. గర్భిణీ మహిళలు గుడ్లలోని పసుపు భాగంపై శ్రద్ధ వహించాలి. గుడ్లను దాదాపు 10-12 నిమిషాలు ఉడికించాలి. అదే ఫ్రైడ్ ఎగ్ అయితే రెండు వైపులా 2-3 నిమిషాలు కుక్ అయ్యేట్టు చూసుకోవాలి. 


గర్భిణీ స్త్రీలకు గుడ్లు తినడం వల్ల చాలా లాభాలున్నాయి. గుడ్లలో ఉండే ఫ్యాట్ ప్రోటీన్లు ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. జెస్టేషనల్ డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుంది. గుడ్లలో ఉండే పోషక పదార్ధాలు గర్భంలో ఉండే శిశువు ఎదుగుదలకు చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ బి12, కోలీన్ ఆరోగ్యమైన మస్తిష్క వికాసానికి దోహదపడతాయి.


Also read: Women Health in Periods: పీరియడ్స్‌లో ఎదురయ్యే సమస్యలు ఆరోగ్యానికి మంచిదా కాదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook